Israel : జైల్లో ఉన్న సమయంలోనే ఆలూ చిప్స్ సహాయంతో..నలుగురు బిడ్డలకు తండ్రి అయిన ఖైదీ

15 ఏళ్లుగా జైలులోనే శిక్ష అనుభవించే ఓ ఖైదీ..బయటకొచ్చేసరికి నలుగురు బిడ్డలకు తండ్రి అయ్యాడు. ఆలూ చిప్స్ సహాయంతో జైలునుంచే భార్యతో నలుగురు బిడ్డలకు తండ్రి అయ్యాడు.

Israel : జైల్లో ఉన్న సమయంలోనే ఆలూ చిప్స్ సహాయంతో..నలుగురు బిడ్డలకు తండ్రి అయిన ఖైదీ

Man Giving Birth From Prison

A prisoner who is the father of four children from prison: పాలస్తీనాకు చెందిన రాఫత్ అల్ కారావి అనే వ్యక్తి జైలులో ఉండగానే ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు బిడ్డలకు తండ్రి అయ్యాడు. రాఫత్ జైలులో 15ఏళ్లుగా శిక్ష అనుభవిస్తుంటే అతని భార్య మాత్రం బయటే ఉంది. అయినా రాఫత్ ద్వారానే భార్య గర్భవతి అయ్యి నలుగురు బిడ్డల తల్లి అయ్యింది.అతను జైలునుంచి తప్పించుకుని భార్య వద్దకెళ్లాడా? అంటే అదీకాదు.అలా అయితే ఒకసారి లేదా రెండుసార్లు సాధ్యం కావచ్చు. కానీ నలుగులు పిల్లలు పుట్టేలా అన్నిసార్లు జైలునుంచి తప్పించుకుని వెళ్లటం సాధ్యంకాదు.కానీ ఇదెలా సాధ్యం అంటే..దానికి ఇతగాడు చేసిన ఘనకార్యమే..! ఇంతకీ అతనేం చేశాడంటే..

Also read : Prisoners Escaped : సినిమా స్టైల్లో..స్పూనుతో సొరంగం త‌వ్వి జైలు నుంచి పారిపోయిన ఖైదీలు..

ఇజ్రాయెల్​కు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో నిందితుడిగా తేలిన రాఫత్ అల్ కారావి అనే వ్యక్తిని 2006లో అరెస్ట్ చేసి జైలులో పెట్టారు. ఉగ్రవాద కార్యకలాపాల చట్టం కింద దోషిగా తేల్చి..15 ఏళ్లు శిక్ష విధించారు. అలా రాఫత్ 15 ఏళ్లు ఇజ్రాయెల్​లోని జైలులో శిక్ష అనుభవించాడు. కానీ అక్కడే జరిగింది అసలు జరగాల్సిందంతా..రాఫత్ ఈ శిక్ష అనుభవిస్తున్న కాలంలోనే నలుగురు పిల్లలకు జన్మనిచ్చాడు. ఈ విషయంపై జైలు నుంచి విడుదలైన తర్వాత రాఫత్ అదోలా సాధ్యమైందో ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. జైలులో ఉన్న సమయంలో తన భార్యతో శారీరకంగా కలవలేదని..కానీ నలుగురు పిల్లలకు ఎలా జన్మనిచ్చాడనే విషయాన్ని సవివరంగా తెలియజేశాడు.

Also read : Prison : జైల్లో ఖైదీల మధ్య గ్యాంగ్ వార్.. 68మంది మృతి

తాను జైలులో ఉన్నప్పుడు..తన కుటుంబ సభ్యులు తనను చూడటానికి వచ్చినప్పుడు వారికి సంచిలో ఐదు వస్తువులను ఇచ్చానని..వాటిలో
ఆలూ చిప్స్ బ్యాగులలో తర వీర్యాన్ని ఉంచి బయటకు పంపించేవాడిననీ..ఈ వీర్యం ప్యాకెట్లను క్యాంటీన్ నుంచి బయటకు పంపించి తన భార్యకు అందేలా చేశానని.. అలా తన ఈ వీర్యాన్ని నా భార్య నేరుగా ఇన్​ఫర్టిలిటీ క్లినిక్​కు తీసుకెళ్లింది. అక్కడ చికిత్స చేయించుకుని నలుగురు బిడ్డలకు జన్మనిచ్చి తనను నాలుగుసార్లు తండ్రిని చేసిందని తెలిపాడు.

కాగా..ఇలా వస్తువులను పంపించే వెసులుబాటు ఇజ్రాయెల్ జైళ్లలో ఉంటుందట. ఆ అవకాశాన్ని రాఫత్ తను తండ్రి అవ్వటానికి ఉపయోగించుకున్నాడు. జైలు అధికారులు (ములాఖత్) ఖైదీల పేర్లను పిలిచే ముందే తన వంతు వచ్చే సమయానికి తన వీర్యాన్ని ఆలూ ప్యాకెట్​లో కట్టి..ఆ చిప్స్ ప్యాకెట్​పై గుర్తు పెడతాడు. ఆచిప్స్ ప్యాకెట్లను జైలు అధికారులకు అనుమానం రాకుండా సీల్ చేసి..తనను కలవటానికి వచ్చే కుటుంబ సభ్యులకు అందజేస్తాడు. ఆ వీర్యం ప్యాకెట్ ఇవ్వనున్న విషయం గురించి అంతకుముందు వారు వచ్చినప్పుడే చెప్పి పెట్టి ఉంచుతాడు.

Also read :Gang war in Prison: జైలులో గ్యాంగ్‌ వార్‌..116కు చేరిన మృతులు

‘కుటుంబ సభ్యులను ఖైదీలను కలిసేటప్పుడు బ్యాగు వారి ఉంటుంది. జైలు అధికారులు చెకింగ్ చేసిన తర్వాత దాన్ని ఎవరూ ముట్టుకోరు. అంటే వారు ఖైదీలను కలిసి వెళ్లేటప్పుడు కూడా దాన్ని ఎవ్వరు చెక్ చేయరు. అలా వారు వెళ్లేటప్పుడు కుటుంబ సభ్యులకు ఇవ్వొచ్చు. దాన్ని తీసుకొని కుటుంబ సభ్యులు నేరుగా ఫర్టిలిటీ కేంద్రానికి వెళ్తి అక్కడ చికిత్స్ ద్వారా తన భార్య పిల్లలకు జన్మనిచ్చిందని అని రాఫత్ వివరించాడు.

వంద మంది శిశువులు ఇలాగే..ఇజ్రాయెల్ కేంద్రంగా పనిచేసే ‘పాలస్తీనా మీడియా వాచ్’ గణాంకాల ప్రకారం.. అనేక మంది ఖైదీలు సంతానం కోసం ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. సుమారు వంద మంది చిన్నారులు ఇలా జన్మించి ఉంటారని పాలస్తీనా మీడియా వాచ్ అంచనావేసింది. ఈ పద్ధతిపై ‘అమరా’ అనే పేరుతో సినిమా కూడా తీశారు.

Also read : Nairobi prison fire : బురిండి జైలులో భారీ అగ్నిప్రమాదం.. 38 మంది ఖైదీల సజీవ దహనం

కానీ రాఫత్ చెప్పేదంతా నిజం కాదంటున్నారు అధికారులు. మరోపక్క చిప్స్ ప్యాకెట్​లో వీర్యాన్ని తీసుకెళ్లినట్లు చెబుతున్న రాఫత్ వ్యాఖ్యలపై వైద్య నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పురుషుల వీర్యంలోని శుక్ర కణాలు శరీరం బయట సెకన్లు లేదా కొన్ని నిమిషాల పాటు మాత్రం జీవించి ఉంటాయని రాఫత్ చెప్పినట్లుగా అంత సమయం శుక్ర కణాలు జీవించి ఉండే అవకాశం లేదంటున్నారు. అటువంటిది వీర్యం జైలులో నుంచి బయటకు తీసుకొచ్చి.. ఆస్పత్రిలో చికిత్స చేయించుకునేంత వరకు ఎలా పాడవకుండా ఉందనేది చర్చనీయాంశంగా మారింది.

Also read : ‘Terrorist’ : కాల్చిన ఇనుప చువ్వతో ఖైదీ వీపుపై చెక్కిన అధికారి