Omicron : ఒమిక్రాన్ వేరియంట్ ని మొద‌ట‌గా గుర్తించి మహిళా డాక్టర్ ఎవరో తెలుసా?

ఒమిక్రాన్ వేరియంట్ ను మొద‌ట‌గా ఓ మహిళా డాక్టర్ గుర్తించారు.

Omicron :  ఒమిక్రాన్ వేరియంట్ ని మొద‌ట‌గా గుర్తించి మహిళా డాక్టర్ ఎవరో తెలుసా?

Omicron

New covid..Omicron South African doctor Angelique Coetzee  ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌మంతా మ‌రోసారి కొత్త కరోనా వేరింట్ ‘ఒమిక్రాన్’టెన్షన్ లో ఉంది. ఇప్పటికే 13 దేశాలకు పైగా విస్తరించింది ఈ కొత్త కరోనా వేరియంట్. ఈ కొత్త వేరియంట్ మొదటిగా దక్షిణాఫ్రికాలో వెలుగు చూసింది. దీన్ని మొదటిగా సౌతాఫ్రికాకు చెందిన డాక్ట‌ర్ ఓ మహిళా డాక్టర్ గుర్తించారు. ఆమె పేరు ‘డాక్ట‌ర్ ఆంగెలిక్యూ కొయెట్జీ’.

ఈ కొత్త క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అనే పేరు పెట్టారనే విషయం తెలిసిందే.దీనికి సంబంధించి కొత్త ఫోటోలు కూడా విడుదల అయ్యాయి. ఒమిక్రాన్ అని పేరు పెట్టిన ఈ వేరియంట్ కు ముందుగా బీ.1.1.529 అనే పేరు పెట్టారు. ఆ త‌ర్వాత ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ దానికి ‘ఒమిక్రాన్’ అనే పేరు పెట్టింది. ఈ కొత్త వేరియంట్ గురించి సౌతాఫ్రికా సైంటిస్టులు న‌వంబ‌ర్ 25న ప్ర‌పంచానికి తెలియ‌జేశారు. కానీ ఈ ఒమిక్రాన్ వైర‌స్‌ను మొద‌ట‌గా గుర్తించింది మాత్రం సౌత్ ఆఫ్రికా మెడిక‌ల్ అసోసియేష‌న్ అధ్య‌క్షురాలిగా ఉన్న డాక్ట‌ర్ ఆంగెలిక్యూ కొయెట్జీ.

Read more : Omicron Mumbai : సౌతాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా

కొన్ని రోజుల క్రితం దక్షిణాఫ్రియాలో 30 మంది వ్య‌క్తుల‌కు క‌రోనా సోకింద‌ట‌. కానీ.. అది అప్ప‌టి వ‌ర‌కు ఉన్న ఏ వేరియంట్‌తోనూ స‌రిపోల‌లేద‌ట‌. దీంతో త‌న‌కు అనుమానం వ‌చ్చి ఆ వైర‌స్ శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించింది. ల్యాబ్‌లో ఆ వైర‌స్‌ను ప‌రీక్షించిన సైంటిస్టులు.. అది కొత్త వేరియంట్ అని.. క‌రోనా మ్యూటేష‌న్ చెంద‌గా ఏర్ప‌డిన కొత్త వేరియంట్ అని స్ప‌ష్టం చేశారు. అది బీ.1.1.529 అంటూ ప్ర‌క‌టించారు.

ఆ వైర‌స్‌.. డెల్టా వైర‌స్ కంటే డేంజ‌ర‌స్ అని అంతా భావించారు. ఈ వైరస్ చాలా ఫాస్టుగా వ్యాపిస్తుందని సైంటిస్టులు అనుమానించారు. మొద‌ట‌గా ఆ వైర‌స్ వ్యాప్తి చెందిన 30 మంది బాధితుల్లో ఎవ్వ‌రికి తీవ్రమైన ల‌క్ష‌ణాలు లేవ‌ని డాక్ట‌ర్ అంగెలిక్యూ స్ప‌ష్టం తెలిపారు. ఈ 30మందిలో 40 ఏళ్ల లోపు వారే ఎక్కువగా ఉన్నారని తెలిపారు.

Read more : Omicron First Pic : కొత్త కరోనా ‘ఒమిక్రాన్‌’ తొలి చిత్రాలు..

ఈ 30మందిలో స‌గం మంది మాత్ర‌మే రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నారు. వాళ్ల‌లో కొంద‌రికి స్వ‌ల్పంగా ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి, పొడి ద‌గ్గు లాంటి సాధారణ కోవిడ్ లక్షణాలు కనిపించాయి. మరికొందరిలో జ్వరం కూడా ఉందని ఆమె తెలిపారు. వారికున్న ల‌క్ష‌ణాలను బ‌ట్టి చూస్తే.. ఇత‌ర వేరియంట్ల‌తో పోల్చితే ఒమిక్రాన్ వేరియంట్ సోక‌డం వ‌ల్ల స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు మాత్ర‌మే క‌నిపించాయని తెలిపారు.

అయితే.. ఒమిక్రాన్ వేరియంట్ ముట్యేష‌న్ చెందుతూ త‌న రూపాన్ని మార్చుకొని వ్యాప్తి చెందుతుండ‌టం వ‌ల్ల వైర‌స్ సోకిన వాళ్ల‌లో ఒక్కొక్క‌రిలో ల‌క్ష‌ణాలు మారుతుంటాయ‌ని డాక్ట‌ర్ ఆంగెలిక్యూ కొయెట్జీ తెలిపారు. అవి ఒక్కోసారి తీవ్ర‌త‌రం చెందే అవకాశముందని అలా అదే జరిగితే..బాధితుల ప్రాణాల‌కే ప్ర‌మాదం అని ఆందోళన వ్యక్తంచేశారు.

ప్ర‌స్తుతం సౌతాఫ్రికాలో వ‌స్తున్న కేసుల్లో ఎక్కువ శాతం ఒమిక్రాన్ వేరియంట్ సోకిన‌వే ఉంటున్నాయి. ఈ కేసుల చాలా వేగంగా పెరుగుతోంది.ఇప్ప‌టికే సౌతాఫ్రికాతో పాటు దాదాపు 15 దేశాలకు కూడా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెంద‌డంతో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. అంత‌ర్జాతీయ ప్ర‌యాణికుల‌పై దృష్టి పెట్టి..విదేశాల నుంచి వచ్చినవారికి పరీక్షలు చేస్తున్నారు. లక్షణాలు కనిపిస్తే క్వారంటైన్ లో ఉంది వారి శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపిస్తున్నారు. ఈక్రమంలో దక్షాణాఫ్రికానుంచి ఢిల్లీకి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అని శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపించారు.