Omicron First Pic : కొత్త కరోనా ‘ఒమిక్రాన్‌’ తొలి చిత్రాలు..

ఒమిక్రాన్‌ వేరియంట్‌ తొలి చిత్రాన్ని రోమ్‌లోని ప్రఖ్యాత ‘బాంబినో గెసు’ఆసుపత్రి వర్గాలు విడుదల చేశాయి. ఈ త్రీడైమెన్షనల్‌ చిత్రం ఒక మ్యాప్‌లా ఉంది.

Omicron First Pic : కొత్త కరోనా ‘ఒమిక్రాన్‌’ తొలి చిత్రాలు..

Lok Sabha

‘Bambino Gesu’ hospital released first pic ‘Omicron’ : కరోనా వైరస్ వచ్చాక..దాని రూపం ఎలా ఉంటుందో విడుదలైన మొదటి ఫోటోలు చూశాం. దాదాపు రెండేళ్లనుంచి కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా అంటే బంతికి ముళ్లున్న ఫోటోలు లక్షలాదిగా ఇంటర్నెట్ లో దర్శమిస్తున్నాయి. ఈకరోనా పలు రూపాలుగా మారి ప్రపంచ వ్యాప్తంగా హడలెత్తిస్తోంది. కొత్త వేరియంట్లుగా మారి సైంటిస్టులకు కూడా పరీక్షలు పెడుతోంది. ఈక్రమంలో కరోనా మరో కొత్తగా మారి..‘ఒమిక్రాన్ ’గా మరింత హడలెత్తిస్తోంది. మరి ఈ ‘ఒమిక్రాన్’ ఫోటోలు ఎలా ఉంటాయి? పాత కరోనాలాగే ఉంటుందా? లేదా కొత్తగా ఉంటుందా?అనే ఆసక్తి నెలకొంది. ఈక్రమంలో ‘ఒమిక్రాన్’ ఫోటోలను రోమ్‌లోని ప్రఖ్యాత ‘బాంబినో గెసు’ ఆసుపత్రి వర్గాలు విడుదల చేశాయి. ఇవి త్రీడైమెన్షనల్‌ చిత్రం ఒక మ్యాప్‌లా ఉంది.

Read more : Omicron: ఒమిక్రాన్‌లో 30 రకాల మ్యుటేషన్లు ప్రమాదకరంగా మారొచ్చు!

సార్స్‌కోవ్‌-2 వైరస్‌లో మ్యూటేషన్‌ చెంది కొత్తగా వచ్చిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఒమిక్రాన్‌ను డెల్టాతో పోలిస్తే చాలా మార్పులు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే చాలా జాగ్రత్తగా ఉండాలని..మాస్కులు..శానిటైజర్లు తప్పనిసరి అని హెచ్చరిస్తున్నారు. తాజాగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ తొలి చిత్రాన్ని రోమ్‌లోని ప్రఖ్యాత ‘బాంబినో గెసు’ (Bambino Gesu)ఆసుపత్రి వర్గాలు విడుదల చేశాయి. ఈ త్రీడైమెన్షనల్‌ చిత్రం ఒక మ్యాప్‌లా ఉంది. ‘‘డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్లో చాలా మార్పులు చోటు చేసుకొన్నట్లు మనం స్పష్టంగా చూడవచ్చు.

ఆ మార్పులు మొత్తం మానవ శరీరానికి అతుక్కునే ఒక ప్రొటీన్‌ భాగంలోనే చోటు చేసుకొన్నట్లు అర్థమవుతోంది. ఇవి కేవలం ప్రమాదకరమైనవే కాదు.. మానవులకు భవిష్యత్తులో సోకే కొత్త వేరియంట్లకు కారణమవుతాయి’’ అని పరిశోధకులు ఆదివారం (నవంబర్ 28,2021)విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.

Read more : Corona Virus: సెకండ్ వేవ్‍కి కారణమైన డెల్టా కంటే 6 రెట్లు వేగంగా ఓమిక్రాన్ వ్యాప్తి.. వ్యాక్సిన్ కూడా పనిచేయట్లేదు

రోమ్‌లోని ఈ పరిశోధన బృందం కరోనావైరస్‌లో వచ్చే మ్యూటేషన్ల స్పైక్‌ ప్రొటీన్‌ త్రీడైమన్షనల్‌ ఇమేజస్‌ పై దృష్టిపెట్టిందని మిలన్‌ స్టేట్‌ యూనివర్శిటీ మైక్రోబయాలజీ ప్రొఫెసర్‌ క్లౌడియా ఆల్టరీ పేర్కొన్నారు. ఇక ఒమిక్రాన్‌తో వైరస్‌ వ్యాప్తి వేగం పెరుగుతుందా..? వ్యాక్సిన్ల సామర్థ్యం తగ్గుతుందా? అనే అంశాలపై పరిశోధనలు చేయాల్సి ఉందని అన్నారు.