Omicron: ఒమిక్రాన్‌లో 30 రకాల మ్యుటేషన్లు ప్రమాదకరంగా మారొచ్చు!

దక్షిణాఫ్రికాలో పుట్టి అత్యంత అత్యంత ప్రమాదకరంగా మారిన ఒమిక్రాన్‌లోని స్పైక్‌ ప్రొటీన్‌‌లో 30కిపైగా మ్యూటేషన్స్ ఉన్నట్లు ఎయిమ్స్‌ చీఫ్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా పేర్కొన్నారు.

Omicron: ఒమిక్రాన్‌లో 30 రకాల మ్యుటేషన్లు ప్రమాదకరంగా మారొచ్చు!

Corona Virus

Omicron: దక్షిణాఫ్రికాలో పుట్టి అత్యంత అత్యంత ప్రమాదకరంగా మారిన ఒమిక్రాన్‌లోని స్పైక్‌ ప్రొటీన్‌‌లో 30కిపైగా మ్యూటేషన్స్ ఉన్నట్లు ఎయిమ్స్‌ చీఫ్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా పేర్కొన్నారు. సాధారణంగా ఇది రోగనిరోధక వ్యవస్థతో తప్పించుకోగలం. ఈ మ్యూటేషన్లే ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయని… అలా జరిగితే టీకా కెపాసిటీ కూడా సరిపోదేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌లు ఈ వేరియంట్‌ను ఏ మేరకు ఎదుర్కొంటాయనే అంశంపై క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరముందని డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కొవిడ్‌ నిబంధనలు పాటించడం, వ్యాక్సిన్‌ తీసుకోవడంలో ప్రజలు నిర్లక్ష్యం వహించవద్దంటూ హెచ్చరించారు.

‘స్పైక్‌ ప్రొటీన్‌ను లక్ష్యంగా చేసుకొనే చాలా వ్యాక్సిన్‌లు పనిచేస్తున్నాయి. స్పైక్‌ ప్రొటీన్‌లు వైరస్‌ను గుర్తించినప్పుడు వాటిని ఎదుర్కొనే యాంటీబాడీలను వృద్ధి చేస్తాయి. మానవ కణంలోకి వైరస్‌ ప్రవేశించకుండా అడ్డుకుంటాయి. తాజా వేరియంట్‌లో స్పైక్‌ ప్రొటీన్‌లోనే దాదాపు 30కిపైగా మ్యూటేషన్స్ కనిపించాయి. స్పైక్‌ ప్రొటీన్‌ భాగంలో ఎక్కువ ఉత్పరివర్తనాలు సంభవిస్తే వ్యాక్సిన్‌ సమర్థత తగ్గిపోవడానికి దారితీస్తుంది’ అని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా వెల్లడించారు.

…………………………………….. : శ్వాస సంబంధిత సమస్యలకు… వేడి నీళ్లు

ఈ ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని.. మరింత అప్రమత్తంగా ఉండాలని కొవిడ్‌ నిబంధనలపై నిర్లక్ష్యం వహించకూడదని డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా పేర్కొన్నారు. ముఖ్యంగా ఇంటర్నేషనల్ ప్రయాణికులతోపాటు స్థానికంగా కొవిడ్‌ కేసులు అకస్మాత్తుగా పెరిగే ప్రాంతాల్లో నిఘా పెంచాలని స్పష్టం చేశారు. ఈ కొత్తరకం వేరియంట్‌ మన దేశంలో ఇప్పటివరకు వెలుగు చూడలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ ఒమిక్రాన్‌ (B.1.1.529) వేరియంట్‌ నవంబర్‌ 24న దక్షిణాఫ్రికాలో వెలుగు చూసింది. బొత్సువానా, బెల్జియం, హాంకాంగ్‌, ఇజ్రాయెల్‌, ఆస్ట్రేలియాతోపాటు పలు దేశాలకు విస్తరించింది. ఈ వేరియంట్‌పై సమీక్షించిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆందోళనకర వేరియంట్‌గా ప్రకటించి ఒమిక్రాన్ గా నామకరణం చేసింది.

……………………………………. : నేను వెళ్తేనే నువ్వు గెలుస్తావు.. షణ్ను కోసం రవి త్యాగం?