Black Mamba Snake: క్రిస్మస్ ట్రీ కింద విషపూరిత పాము.. చూసి వణికిపోయిన కుటుంబం

ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలకు సన్నద్ధమవుతున్నారు. పండుగ నేపథ్యంలో క్రిస్మస్ ట్రీ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నారు. అయితే, సంప్రదాయం ప్రకారం క్రిస్మస్ ట్రీ తెచ్చుకుని పెట్టుకున్న ఓ కుటుంబానికి షాక్ తగిలింది. ఎందుకంటే క్రిస్మస్ ట్రీ కింద వారికి ప్రపంచంలోనే అత్యంత విషపూరిత బ్లాక్ మాంబా పాము కనపడింది. దాన్ని చూడగాన్నే వారి వెన్నులో వణుకు పుట్టింది.

Black Mamba Snake: క్రిస్మస్ ట్రీ కింద విషపూరిత పాము.. చూసి వణికిపోయిన కుటుంబం

Black Mamba Snake

Black Mamba Snake: ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలకు సన్నద్ధమవుతున్నారు. పండుగ నేపథ్యంలో క్రిస్మస్ ట్రీ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నారు. అయితే, సంప్రదాయం ప్రకారం క్రిస్మస్ ట్రీ తెచ్చుకుని పెట్టుకున్న ఓ కుటుంబానికి షాక్ తగిలింది. ఎందుకంటే క్రిస్మస్ ట్రీ కింద వారికి ప్రపంచంలోనే అత్యంత విషపూరిత బ్లాక్ మాంబా పాము కనపడింది. దాన్ని చూడగాన్నే వారి వెన్నులో వణుకు పుట్టింది.

ఈ విషయాన్ని తెలుపుతూ పాములు పట్టే వ్యక్తి నిక్ ఇవెన్ ఫేక్ బుక్ లో పోస్ట్ చేశాడు. క్రిస్మస్ ట్రీ నుంచి బహుమతులు, బొమ్మలు వస్తాయని చిన్నారులు ఆశ పడతారు. అయితే, దాని కింద పాము ఉండడం చూసి భయంతో వణికిపోయారు. దక్షిణాఫ్రికాలోని ఓ కుటుంబానికి ఈ భయంకర అనుభవం ఎదురైంది. ఆ పామును చూసిన వెంటనే పాములు పట్టే వారికి ఆ కుటుంబం ఫోన్ చేసింది.

వారు వచ్చి ఆ పామును పట్టుకుని వెళ్లి సురక్షిత ప్రాంతంలో వదిలేశారు. దగ్గరలోని ఓ తోట నుంచి ఆ పాము ఇంట్లోకి చొరబడిందని పాములు పట్టే వ్యక్తి చెప్పాడు. ఆ పాముకు సంబంధించిన ఫొటోను కూడా నిక్ పోస్ట్ చేశాడు. ఆ విషపూరిత పాము 2.1 మీటర్ల పొడవు ఉందని చెప్పాడు.

 

Bangladesh vs India: క్యాచులు వదిలేసి అసహనం తెప్పించిన కోహ్లీ.. వీడియో వైరల్