Toilet Pay Money : ఇక్కడి టాయిలెట్స్ వాడితే ఎదురు డబ్బులిస్తారు..!
ఈ టాయిలెట్ వాడితే.. ఎదురు డబ్బులిస్తారంట.. ఇదో కొత్త రకం టాయిలెట్.. బయోగ్యాస్, ఎరువుల తయారీ కోసం ఈ టాయిలెట్ రూపొందించారట.. వాక్యూమ్ పంప్ ద్వారా మానవ వ్యర్థాలను భూగర్భ ట్యాంకులోకి పంపుతారు.

South Korean Toilet Pays Digital Currency To Buy Things You Want
toilet pays digital currency : ఈ టాయిలెట్ వాడితే.. ఎదురు డబ్బులిస్తారంట.. ఇదో కొత్త రకం టాయిలెట్.. బయోగ్యాస్, ఎరువుల తయారీ కోసం ఈ టాయిలెట్ రూపొందించారట.. వాక్యూమ్ పంప్ ద్వారా మానవ వ్యర్థాలను భూగర్భ ట్యాంకులోకి పంపుతారు. అలా సూక్ష్మజీవుల ద్వారా మిథేన్ గా మారుస్తారు. ఇందుకోసం వారికి మానవ వ్యర్థాలు అవసరం.. అందుకే టాయిలెట్ వాడమని కోరుతున్నారు. టాయిలెట్ వాడిన వారికి డిజిటల్ కరెన్సీ రూపంలో డబ్బులు చెల్లిస్తున్నారు. ఈ కొత్త రకం టాయిలెట్ సౌత్ కొరియాలో అందుబాటులోకి వచ్చింది. అక్కడ కొన్ని టాయిలెట్స్‌ను వినియోగిస్తే మన నుంచి డబ్బులు వసూలు చేయరు.. అందుకు బదులుగా తిరిగి మనకే డబ్బులిస్తారు..
దక్షిణకొరియాలోని ఉల్సాన్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పర్యావరణ ఇంజినీరింగ్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించే చో జై-వూన్ కొత్త రకం మరుగుదొడ్డిని రూపొందించారు. ఇంటికి అవసరమైన విద్యుత్తు, బయోగ్యాస్, ఎరువులను అందిస్తున్నారు. ఉల్సాన్ యూనివర్సిటీకి అవసరమైన విద్యుత్తును ఈ కొత్త రకం టాయిలెట్ల నుంచే వినియోగిస్తున్నారు.
విద్యుత్తు, ఎరువుల తయారీకి మానవ వ్యర్థాలు ఎంతగానో అవసరం ఉందని చెబుతున్నారు. అందుకే ఈ టాయిలెట్లను వాడేందుకు ప్రజలు ప్రోత్సహించేందుకు వారికే కొంత నగదు చెల్లిస్తున్నారు. ఈ టాయిలెట్ల వాడటం ద్వారా వచ్చిన డిజిటల్ కరెన్సీతో కాఫీ టీలు, అరటి పండ్లు కొనుగోలు చేయవచ్చునని చో జై-వూన్ సూచిస్తున్నారు. టాయిలెట్ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే డబ్బులు నేరుగా అకౌంట్లలో క్రెడిట్ అవుతాయట.