Singles in Korea: పెళ్లొద్దు మొర్రో అంటున్న కొరియన్ యువత.. కోటికి చేరువలో సింగిల్ పసంగులు

ప్రపంచంలో అత్యంత తక్కువ సంతానోత్పత్తి రేటు నమోదు అవుతున్న దేశాల్లో దక్షిణ కొరియా ఒకటి. పెళ్లి వయసుకు వచ్చిన వాళ్లు, కుటుంబ జీవనానికి దూరంగా ఉండడమే దీనికి ప్రధాన కారణమని సర్వేలు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో సంతనోత్పత్తి మరింత తగ్గే అవకాశం కూడా ఉండనుంది.

Singles in Korea: పెళ్లొద్దు మొర్రో అంటున్న కొరియన్ యువత.. కోటికి చేరువలో సింగిల్ పసంగులు

South Koreans don't wish to marry: 2 in every 5 will live alone in 2050

Singles in Korea: దక్షిణ కొరియాలో పెళ్లికాని జనాభా ఎక్కువవుతోంది. ఎంతలా పెరుగుతోందంటే, మరో 30 ఏళ్లలో దేశంలో సగం జనాభా వీరే కానున్నట్లు ఆ దేశానికి సంబంధించిన ఓ సంస్థ చేసిన సర్వే పేర్కొంది. ప్రస్తుతం దక్షిణ కొరియాలో 72 లక్షల మంది యువత పెళ్లికి దూరంగా ఉన్నారు. ఇది కొరియా మొత్తంలో ఉన్న కుటుంబాల్లో మూడవ వంతు. సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం ఈ జనాభా 15.5 శాతంగా ఉండేది. క్రమక్రమంగా ఇది 30కి చేరింది. ఇదే తంతు కొనసాగితే 2050 నాటికి 40 శాతానికి చేరనుందని ఆ సర్వే తెలిపింది.

MCD Polls: రాజ్యాన్ని గెలిచి రాజధానిలో నెగ్గని బీజేపీ.. మున్సిపల్ ఎన్నికల్లో ఓటమితో ఢిల్లీపై మరింత పట్టు సడలింది

ప్రపంచంలో అత్యంత తక్కువ సంతానోత్పత్తి రేటు నమోదు అవుతున్న దేశాల్లో దక్షిణ కొరియా ఒకటి. పెళ్లి వయసుకు వచ్చిన వాళ్లు, కుటుంబ జీవనానికి దూరంగా ఉండడమే దీనికి ప్రధాన కారణమని సర్వేలు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో సంతనోత్పత్తి మరింత తగ్గే అవకాశం కూడా ఉండనుంది. జనాభా పరంగా చాలా తక్కువే అయినప్పటికీ, బ్రిటన్ స్థాయిలో సింగల్స్ ఉన్నారు దక్షిణ కొరియాలో. అయితే జపాన్, జర్మనీ దేశాలతో పోల్చుకుంటే ఇది తక్కువే అయినప్పటికీ.. జనాభా నిష్పత్తి ప్రకారం చూసుకుంటే చాలా ఎక్కువే అంటున్నారు.

China Protest: కొవిడ్ లాక్‭డౌన్‭పై చైనీయుల చారిత్రక ఆందోళన వృధాయేనా? తగ్గినట్టే తగ్గి కంచెలు బిగుస్తోన్న జిన్‭పింగ్ సర్కార్

యువత ఒంటరిగా ఉండిపోవడానికి గల ప్రధాన కారణం సామాజిక నిబందనల్ని, ఆర్థిక పరిస్థితుల్ని ఎదుర్కోలేని పరిస్థితేనట. అక్కడి కుటుంబ జీవనంలో ఇమిడి పోయిన వీటిని ఎదుర్కొనేందుకు కొరియన్ యువత ఇబ్బంది పడుతోందట. దాని కంటే ఒంటరి జీవితమే మేలని వారు అనుకుంటున్నట్లు సర్వే తెలిపింది. సరిపడా డబ్బు లేకపోవడం, ఉద్యోగ భద్రత లేకపోవడం కారణంగా సగం మంది పెళ్లికి దూరంగా ఉంటున్నారు. ఇక 12 శాతం మంది పిల్లల పెంపకాన్ని భారంగా భావించి ఒంటరిగా ఉంటున్నారు. 25 శాతం మంది తమకు సరైన భాగస్వామి దొరకలేదని, లేదంటే పెళ్లి చేసుకోవడమే వృధా అంటున్నారు. ఇప్పటికే దక్షిణ కొరియాలో వృద్ధ జనాభా చాలా ఎక్కువగా ఉంది. దీనికి తోడు యువత పెళ్లికి దూరంగా ఉంటే రాబోయే రోజుల్లో ఈ ప్రభావం మరింత తీవ్రంగా మారనున్నట్లు నిపుణులు చెబుతున్నారు.