MCD Polls: రాజ్యాన్ని గెలిచి రాజధానిలో నెగ్గని బీజేపీ.. మున్సిపల్ ఎన్నికల్లో ఓటమితో ఢిల్లీపై మరింత పట్టు సడలింది

తాజా ఎన్నికల్లో దాన్ని అధిగమించి ఢిల్లీ మున్సిపాలిటీపై చీపురు గుర్తు జెండాను ఎగురవేసింది. ఇక ఢిల్లీలో బీజేపీని సంపూర్ణంగా నిలువరించడానికి లోక్‭సభ ఎన్నికలు మాత్రమే ఉన్నాయి. ఢిల్లీలోని 7 లోక్‭సభ స్థానాల్లో ఏడింటినీ బీజేపీనే గెలుస్తూ వస్తోంది. ఆ స్థానాల్లో కూడా సత్తా చాటితే రాజధానిలో బీజేపీపై ఆప్ సంపూర్ణ విజయం సాధించినట్లే.

MCD Polls: రాజ్యాన్ని గెలిచి రాజధానిలో నెగ్గని బీజేపీ.. మున్సిపల్ ఎన్నికల్లో ఓటమితో ఢిల్లీపై మరింత పట్టు సడలింది

With the defeat in the municipal elections, BJP grip on Delhi was further loosened

MCD Polls: ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. కొన్నిసార్లు ఇది సాధ్యం కాకపోవచ్చు. కాకపోతే రచ్చ గెలిచాకైనా ఇంట గెలవాలి. లేదంటే సంపూర్ణ గెలుపు అనిపించుకోదు. బీజేపీ పరిస్థితి దాదాపుగా ఇలాగే ఉంది. రాజ్యాన్ని గెలిచినప్పటికీ రాజధానిలో నిలవేకపోతోంది. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కాషాయ జెండా పాతేస్తున్న కమల పార్టీకి రాజధాని ఢిల్లీ మాత్రం అంతు చిక్కడం లేదు. లోక్‭సభ, మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతున్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం నిలవలేకపోతోంది. ఢిల్లీ అసెంబ్లీ పీఠాన్ని ఎలా చేజిక్కించుకోవాలో తెలియక మదన పడుతున్న బీజేపీకి.. మున్సిపల్ ఎన్నికలు మరింత ఇబ్బందుల్లోకి నెట్టాయి.

Delhi MCD Elections: 15ఏళ్ల కాషాయ కోటను బద్దలు కొట్టిన ఆప్.. ఢిల్లీ కార్పొరేషన్ పీఠం కైవసం

బుధవారం ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో బీజేపీ ఓటమి పాలయ్యింది. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. దీంతో 15 ఏళ్లుగా మున్సిపాలిటీపై ఎగురుతున్న కాషాయం జెండా ఒక్కసారిగా నేల కూలింది. ఢిల్లీని తమ చేతుల్లోకి తీసుకోవాలని ఆరాట పడుతున్న బీజేపీకి కేజ్రీవాల్ చెక్‭మేట్‭లా మారారు. కాషాయ పార్టీని ఎక్కడికక్కడ కార్నర్ చేసి తాను మాత్రం విజయ విహారం చేస్తున్నారు. అసెంబ్లీలో ప్రభావం చూపలేక అవస్తలు పడుతున్న బీజేపీకి మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి మరింత కృంగదీసింది. దీంతో లోక్‭సభ ఎన్నికలపై గుబులు పట్టుకుంది.

Poison Experiment On Students : ఇరాన్ లో హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు.. విద్యార్థులపై విష ప్రయోగం!

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‭లో మొత్తం 250 వార్డులు ఉండగా, మెజారిటీకి కావాల్సినవి 126 సీట్లు. అయితే ఆప్ ఏకంగా 134 వార్డుల్లో విజయం సాధించింది. అసెంబ్లీపై రెండు దఫాలుగా ఆధిపత్యం సాగిస్తున్న ఆప్‭కు మున్సిపాలిటీలో పరాభవమే ఎదురవుతోంది. అయితే తాజా ఎన్నికల్లో దాన్ని అధిగమించి ఢిల్లీ మున్సిపాలిటీపై చీపురు గుర్తు జెండాను ఎగురవేసింది. ఇక ఢిల్లీలో బీజేపీని సంపూర్ణంగా నిలువరించడానికి లోక్‭సభ ఎన్నికలు మాత్రమే ఉన్నాయి. ఢిల్లీలోని 7 లోక్‭సభ స్థానాల్లో ఏడింటినీ బీజేపీనే గెలుస్తూ వస్తోంది. ఆ స్థానాల్లో కూడా సత్తా చాటితే రాజధానిలో బీజేపీపై ఆప్ సంపూర్ణ విజయం సాధించినట్లే.

Babri Masjid: అయోధ్యలో బాబ్రీ మసీదును నేలకూల్చి నేటికి 30 ఏళ్లు.. రాబోయే ఎన్నికల లోపే రామాలయం పూర్తి!

ఢిల్లీ మున్సిపాల్ కార్పొరేషన్ 1958లో ఏర్పాటైంది. 2012లో అప్పటి ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ హయాంలో మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేశారు. తిరిగి వాటిని ఈ ఏడాది విలీనం చేసి ఎంసీడీగా పునరుద్దరించారు. మే 22 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఢిల్లీ మున్సిపల్ పీఠంపై గత 15ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉంటూ వస్తుంది. 2017లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 181 స్థానాల్లో విజయం సాధించింది. ఆప్ 48, కాంగ్రెస్ 27 వార్డుల్లో గెలుచుకుంది. ఢిల్లీ కార్పొరేషన్ ను కైవసం చేసుకోవటంతో ఆప్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. పార్టీ కార్యాలయం వద్ద ఆప్ కార్యకర్తలు స్వీట్లు తినిపించుకుంటూ సంబరాలు చేసుకున్నారు. ఎన్నికల్లో విజయం పట్ల పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రజలు బీజేపీకి గట్టి బుద్ధి చెప్పారని, అభివృద్ధి కోసం పనిచేసిన వారికే ఓటు వేశారని అరవింద్ కేజ్రీవాల్ పై బీజేపీ చల్లుతున్న బురదను తుడిచివేశారని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా అన్నారు.