Starship: ప్రయోగించిన కొద్ది సేపటికే పేలిపోయిన అతిపెద్ద రాకెట్ స్టార్‭షిప్.. మస్క్ ఏమన్నారంటే..?

విజయవంతంగా నింగిలోకి ఎగసిన స్టార్‌‌షిప్ క్యాప్సూల్ మొదటి దశలో రాకెట్ బూస్టర్ నుంచి వేరయ్యే క్రమంలో సెపరేషన్ విఫలమైంది. టెస్ట్ ఫ్లైట్లో భాగంగా ఈ రాకెట్ కు చెందిన రెండు సెక్షన్లు నిర్ణీత సమయం ప్రకారం మూడు నిమిషాల్లో విడిపోవాలి. కానీ, అంతకు ముందే పేలిపోయింది

Starship: ప్రయోగించిన కొద్ది సేపటికే పేలిపోయిన అతిపెద్ద రాకెట్ స్టార్‭షిప్.. మస్క్ ఏమన్నారంటే..?

Starship

Updated On : April 20, 2023 / 8:43 PM IST

Starship: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోనే చేపట్టిన స్టార్‭షిప్ ప్రయోగం విఫలమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్‭గా పేరు గాంచిన దీన్ని.. మస్క్ స్థాపించిన స్పేస్‭ఎక్స్ రూపొందించి ప్రయోగించింది. అయితే ప్రయోగించిన కొద్ది సేపటికే రాకెట్ పేలిపోయింది. స్థానిక కాలమానం ప్రకారం గురువారం ఉదయం 8.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. అమెరికాలోని దక్షిణ టెక్సాస్‭లో ఉన్న బోకా చీకా తీరం నుంచి ఈ ప్రయోగం చేపట్టారు. తొలుత చంద్రుడిపైకి, ఆ తర్వాత అంగారకుడు, ఆపై గ్రహాల్లోకి వ్యోమగాములను మోసుకెళ్లేందుకు నిర్మించిన ఈ రాకెట్ ప్రపంచంలోనే శక్తిమంతమైన అతిపెద్ద రాకెట్.

Ram Charan: వంద కాదు షేర్ ఖాన్.. ఇప్పుడు వెయ్యి మందితో ‘గేమ్ చేంజర్’ వార్!

విజయవంతంగా నింగిలోకి ఎగసిన స్టార్‌‌షిప్ క్యాప్సూల్ మొదటి దశలో రాకెట్ బూస్టర్ నుంచి వేరయ్యే క్రమంలో సెపరేషన్ విఫలమైంది. టెస్ట్ ఫ్లైట్లో భాగంగా ఈ రాకెట్ కు చెందిన రెండు సెక్షన్లు నిర్ణీత సమయం ప్రకారం మూడు నిమిషాల్లో విడిపోవాలి. కానీ, అంతకు ముందే పేలిపోయింది. కాగా, ఫ్లైట్ టెస్ట్ అనుకున్నంత ఉత్తేజకరంగా సాగలేదని, ఈ ఫలితాలను తమ శాస్త్రవేత్తలు సమీక్షిస్తారని స్పేస్ఎక్స్ ట్వీట్ చేసింది. అయితే ఈ వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకున్నామని, మరికొద్ది రోజుల్లో మరో ప్రయోగం విజయవంతంగా చేపడతామని సిబ్బందిని అభినందిస్తూ ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు.

Gujarat: 2002 గుజరాత్ అల్లర్ల కేసులో 60 మందిని నిర్దోషులుగా విడుదల చేసిన ప్రత్యే కోర్టు

ఈ స్టార్‌షిప్‌ సూపర్ హెవీలో రాప్టార్ ఇంజిన్లను ఉపయోగించారు. వీటిలో మిథేన్, లిక్విడ్ ఆక్సిజన్ ఇంధనాన్ని ఉపయోగించారు. మొత్తంగా 33 రాప్టార్ ఇంజిన్లు మొదటి దశ బూస్టర్‌కు శక్తినిస్తాయి. భూమికి ఆవల ప్రయాణానికి 50 టన్నుల కార్గోను తీసుకెళ్తేందుకు అవసరమైన 1,67,33,085 పౌండ్ల థ్రస్ట్‌ను ఉత్పత్తి చేస్తుంది. కాగా, ఈ స్టార్‌షిప్‌ పొడవు 120 మీటర్లు. గత సోమవారమే దీని ప్రయోగానికి అన్నీ సిద్ధం చేసినప్పటికీ, కొన్ని సాంకేతిక కారణాల దృష్ట్యా నేటికి వాయిదా పడింది. అయితే నేటి ప్రయోగం ఊహించని విధంగా విఫలమైంది.