Ram Charan: వంద కాదు షేర్ ఖాన్.. ఇప్పుడు వెయ్యి మందితో ‘గేమ్ చేంజర్’ వార్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ మూవీలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేసేందుకు దర్శకుడు శంకర్ అండ్ టీమ్ రెడీ అవుతున్నారు.

Ram Charan To Fight With 1000 Fighters In Game Changer Movie
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘గేమ్ చేంజర్’ను దర్శకుడు శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం యావత్ సౌత్ ప్రేక్షకులతో పాటు నార్త్ ఆడియెన్స్ కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా.. ఈ సినిమాలో తమ అభిమాన హీరోను ఎప్పుడెప్పుడు చూద్దామా అని మెగా ఫ్యాన్స్ ఆతృతగా చూస్తున్నారు.
Ram Charan : చిరుత కాదు చిట్టెలుక.. రామ్ చరణ్ గురించి బలగం ఫేమ్ నటుడు కామెంట్స్..
ఈ సినిమాకు సంబంధించిన మెజారిటీ షూటింగ్ ఇప్పటికే ముగిసింది. అయితే, ఈ సినిమాకు ఎంతో కీలకమైన క్లైమాక్స్‌ను ఏప్రిల్ నెలాఖరున స్టార్ట్ చేయబోతున్నట్లు ఇటీవల దర్శకుడు శంకర్ వెల్లడించాడు. దీంతో ఈ సినిమా క్లైమాక్స్ ఏ రేంజ్‌లో ఉంటుందా అనే టాక్ మొదలైంది. కాగా, ఈ సినిమా క్లైమాక్స్‌ను డైరెక్టర్ శంకర్ వేరే లెవెల్‌లో ప్లాన్ చేస్తున్నాడట. గతంలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘మగధీర’ సినిమాలో వందమందితో చరణ్ ఒక్కడే యుద్ధం చేసిన సీక్వెన్స్ మనం చూశాం. ఆ యాక్షన్ సీన్ సినిమాకే హైలైట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు దాన్ని మించిన సీక్వెన్స్‌ను రెడీ చేస్తున్నాడట శంకర్.
Game Changer : ఇండియన్ 2 నుంచి గేమ్ చెంజర్‌కి శంకర్ షిఫ్ట్.. అప్పుడే క్లైమాక్స్ షూట్?
ఏప్రిల్ 24 నుండి జరిగే ఈ చిత్ర క్లైమాక్స్ షూటింగ్‌లో ఏకంగా వెయ్యి మందితో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించనున్నాడట. వెయ్యి మందిని చరణ్ ఒక్కడే ఎదుర్కొనే ఈ సీక్వెన్స్ సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇక ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను కేజీయఫ్ ఫైట్ మాస్టర్స్ అన్బరివ్ తెరకెక్కించనున్నారు. ఈ షెడ్యూల్ మే 5 వరకు కొనసాగుతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా మగధీరలో వంద మందిని ఎదురించిన చరణ్, ఇప్పుడు ఏకంగా వెయ్యి మందిని ఎదురిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.