UK : పోలీసుల నుంచి తప్పించుకోవడానికి రైల్వే ట్రాక్‌‌పై కారును పోనిచ్చాడు..థ్రిల్లింగ్ వీడియో

కారును ఓ వ్యక్తి దొంగిలించి అందులో పారిపోవాలని ప్రయత్నించాడు. ఈ విషయం పోలీసులకు తెలిసిందే. వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఎండ వాతావరణం ఉన్నా..కారు వైపర్లు ఆన్ లోనే ఉన్నాయి. ఈ సమయంలో ఇద్దరు అధికారులు అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించారు.

UK : పోలీసుల నుంచి తప్పించుకోవడానికి రైల్వే ట్రాక్‌‌పై కారును పోనిచ్చాడు..థ్రిల్లింగ్ వీడియో

Uk

Stolen Range Rover : పోలీసుల నుంచి తప్పించుకోవడానికి దొంగలు శతవిధాల ప్రయత్నిస్తుంటారు. ఎన్నో ఫీట్లు చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో దొరికిపోతుంటారు. ఇలాగే ఓ వ్యక్తి దొంగిలించిన కారు (Range Rover)లో పారిపోతుండగా..పోలీసులు పట్టుకొనేందుకు ప్రయత్నించారు. అయితే..వారి నుంచి తప్పించుకోవడానికి ఏకంగా రైల్వే ట్రాక్ పై కారును పోనిచ్చాడు. ఇతడిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. దీనికి సంబంధించిన థ్రిల్లింగ్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఘటన యూకే రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది.

Read More : Eatala Rajender : నన్ను చంపటానికి ఓ మంత్రి హంతక ముఠాను సంప్రదించారు-ఈటల

కారును ఓ వ్యక్తి దొంగిలించి అందులో పారిపోవాలని ప్రయత్నించాడు. ఈ విషయం పోలీసులకు తెలిసిందే. వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఎండ వాతావరణం ఉన్నా..కారు వైపర్లు ఆన్ లోనే ఉన్నాయి. ఈ సమయంలో ఇద్దరు అధికారులు అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఇందులో ఓ మహిళా అధికారిణి కూడా ఉన్నారు. కారులో ఉన్న వ్యక్తిపై పిడిగుద్దులు కురిపించారు. అయినా కూడా..కారును ముందుకు..వెనక్కి పోనిచ్చాడు. ఓ అధికారి అతడిని గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అమాంతం కారును వెనక్కి పోనిచ్చడంతో అందులో నుంచి కిందపడిపోయాడు.

Read More : AP Covid : ఏపీలో 1,628 కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులు

అక్కడనే ఉన్న మహిళా అధికారిణి పట్టుకోవడానికి ప్రయత్నించినా విఫలం చెందారు. తర్వాత జెట్ స్పీడ్ లో కారును ముందుకు పోనిచ్చాడు. సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ క్రాసింగ్ ను ఢీ కొట్టి రైల్వే ట్రాక్ పై కారును పోనిచ్చాడు. ఈ కారణంగా పలు రైళ్లకు అంతరాయం కలిగాయి. ప్రస్తుతం అతడిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది.