AP Covid : ఏపీలో 1,628 కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులు

ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గిపోతున్నాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో వేయి 628 మందికి కరోనా సోకింది. 22 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

AP Covid : ఏపీలో 1,628 కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులు

Ap Covid

Covid Cases In Andhra Pradesh : ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గిపోతున్నాయి. తాజాగా…గత 24 గంటల వ్యవధిలో వేయి 628 మందికి కరోనా సోకింది. 22 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఏపీలో ప్రస్తుతం 23 వేల 570 యరోనా యాక్టివ్ కేసులున్నాయి. 13 వేల 154 మంది మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో ఐదుగురు, కృష్ణాలో నలుగురు కరోనాతో చనిపోయారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కరోనాతో ముగ్గురు చొప్పున మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 291 కరోనా కేసులు నమోదయ్యాయి.

Read More : American Navy : అమెరికన్ నేవీ చరిత్రలో తొలి మహిళా సెయిలర్…శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లోకి

ఏ జిల్లాలో ఎంత మంది చనిపోయారంటే :-
చిత్తూరులో ఐదుగురు, కృష్ణాలో నలుగురు, గుంటూరులో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, అనంతపూర్ లో ఇద్దరు, తూర్పు గోదావరి, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

Read More : Artificial Heart Sale : మొదటిసారిగా..”ఆర్టిపిషియల్ హార్ట్” అమ్మిన ఫ్రెంచ్ సంస్థ

జిల్లాల వారీగా కేసులు : అనంతపురం 36. చిత్తూరు 261. ఈస్ట్ గోదావరి 291. గుంటూరు 112. వైఎస్ఆర్ కడప 92. కృష్ణా 190. కర్నూలు 43. నెల్లూరు 241. ప్రకాశం 134. శ్రీకాకుళం 27. విశాఖపట్టణం 77. విజయనగరం 25. వెస్ట్ గోదావరి 99. మొత్తం : 1,628