Artificial Heart Sale : మొదటిసారిగా..”ఆర్టిపిషియల్ హార్ట్” అమ్మిన ఫ్రెంచ్ సంస్థ

ఫ్రెంచ్ కి చెందిన కృత్రిమ శరీర అవయువాల తయారీ సంస్థ "కార్మెంట్"..మొదటిసారిగా ఓ కృత్రిమ గుండెను అమ్మినట్లు సోమవారం ప్రకటించింది.

Artificial Heart Sale :  మొదటిసారిగా..”ఆర్టిపిషియల్ హార్ట్” అమ్మిన ఫ్రెంచ్ సంస్థ

Heart

Artificial Heart Sale ఫ్రెంచ్ కి చెందిన కృత్రిమ శరీర అవయువాల తయారీ సంస్థ “కార్మెంట్”..మొదటిసారిగా ఓ కృత్రిమ గుండెను అమ్మినట్లు సోమవారం ప్రకటించింది. ఓ ఇటలీ పేషెంట్ కి ట్రాన్స్ ఫ్లాంట్(మార్పిడి)అమలు కోసం కృత్రిమ గుండెను అమ్మినట్లు కార్మెంట్ తెలిపింది. 2008లో సంస్థ ప్రారంభమైన తర్వాత తాము ఆర్టిఫిషియల్ హార్ట్ ని అమ్మడం ఇదే మొదటిసారని పేర్కొంది.

ఇటలీలోని నేపల్స్ లోని ఆర్టిఫిషియల్ హార్ట్స్ విభాగంలో గొప్ప అనుభవం కలిగిన అజియెండా ఓస్పెడలియరా డే కొల్లి హాస్పిటల్ లో హార్ట్ సర్జన్ డాక్టర్ సైరో మైయల్లో నేతృత్వంలోని టీమ్ ఈ కృత్రిమ గుండె ఆపరేషన్ ని నిర్వహించిందని కార్మెంట్ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, ఆర్టిఫిషియల్ హార్ట్ ల ని విక్రయించేందుకు 2020 డిసెంబర్‌లో కంపెనీకి యూరోపియన్ సీఈ మార్కింగ్‌ అనుమతి పొందింది.

ఆర్టిఫిషియల్ హార్ట్ యొక్క మొట్టమొదటి వాణిజ్య అమ్మకం సంస్థ అభివృద్ధిలో ఒక కొత్త అధ్యాయాన్ని తెరిచే ఒక ప్రధాన మైలురాయి అని కార్మెంట్ పేర్కొంది. కృత్రియ హార్ట్ కోసం 177,000డాలర్లకు పైగా ప్రాంతీయ ఆరోగ్య వ్యవస్థ ద్వారా చెల్లించబడ్డాయని తెలిపింది. ఈ సంవత్సరం చివరినాటికి ఫ్రాన్స్ మరియు జర్మనీలో ఎక్కువ మంది వినియోగదారులను కనుగొనడంలో విజయం సాధిస్తామని భావిస్తున్నట్లు తెలిపింది. కాగా,జూలై 15 న కార్మెట్.. నార్త్ కరోలినాలోని డర్హామ్‌లోని డ్యూక్ యూనివర్శిటీ హాస్పిటల్‌లో క్లినికల్ అధ్యయనంలో ఓ అమెరికన్ రోగికి కృత్రిమ గుండెని మొదటిగా అమర్చినట్లు ప్రకటించింది.