Sudan PM : సూడాన్ ప్రధానమంత్రిని అరెస్ట్ చేసిన సైన్యం

అంత్య‌రుద్ధంతో సూడాన్ అల్ల‌క‌ల్లోలంగా మారింది. సూడాన్‌లో ఇటీవ‌ల మిలిటరీ గ్రూప్‌, సివిల్ గ్రూప్‌లకు మధ్య అధికారం పంపిణీ విష‌యంలో వివాదాలు ఏర్పాడ్డాయి. దీంతో ఇరువర్గాల మ‌ధ్య ఆధిప‌త్య

Sudan PM : సూడాన్ ప్రధానమంత్రిని అరెస్ట్ చేసిన సైన్యం

Sudan (1)

Sudan PM  అంత్య‌రుద్ధంతో సూడాన్ అల్ల‌క‌ల్లోలంగా మారింది. సూడాన్‌లో ఇటీవ‌ల మిలిటరీ గ్రూప్‌, సివిల్ గ్రూప్‌లకు మధ్య అధికారం పంపిణీ విష‌యంలో వివాదాలు ఏర్పాడ్డాయి. దీంతో ఇరువర్గాల మ‌ధ్య ఆధిప‌త్య పోరు కొన‌సాగుతోంది. ఈక్ర‌మంలో మిలిట‌రీ మ‌రోసారి తిరుగుబాటుకు దిగింది.

సోమవారం ఉదయం సూడాన్ ఆపద్ధర్మ ప్రధానమంత్రి అబ్దుల్లా హమ్​డోక్​​తో పాటు క్యాబినెట్‌లోని చాలా మంది సభ్యులను అక్కడి సైన్యం అరెస్ట్​ చేసి తిరుగుబాటుకు తెరలేపింది. రాజ‌ధాని ఖార్టోమ్‌లో ప్రధాని అబ్దుల్లా హమ్‌డోక్ ను గృహ నిర్బంధంలో ఉంచింది సైన్యం. త‌మ తిరుగుబాటుకు అనుకూలంగా ప్ర‌క‌ట‌న చేసేందుకు నిరాక‌రించ‌డంతో ప్ర‌ధాని హమ్‌డోక్‌ను సైన్యం ఇంకా త‌మ ఆధీనంలోనే ఉంచుకుంది.

సైనికాధికారులు తిరుగుబాటుకు సెప్టెంబర్​లోనే ప్రయత్నించినా అది విఫలమైంది. అప్పటి నుంచి సుడాన్​ రాజకీయ నేతలు, మిలిటరీ అధికారుల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చివరకు ఆ దేశం సైనిక పాలనలోకి జారుకుంది. రెండేళ్ల క్రితమే ఒమర్​ అల్​ బషీర్​ సుదీర్ఘ పాలన నుంచి బయటపడి ప్రజాస్వామ్యంవైపు అడుగులు వేస్తోన్న సుడాన్​ లో సైనిక తిరుగుబాటు జరగడం ఆ దేశానికి ప్రతికూలంగా మారనుంది.

ప్రస్తుతం దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను సైన్యం నిలిపివేసింది. వంతెనలను మూసివేశారు. దేశంలోని అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యాల‌న్నింటిని మూసివేయ‌డమే కాకుండా.. విమానాల‌ను సైతం ర‌ద్దు చేసింది. దీంతో అక్క‌డ ఏం జ‌రుగుతోందో ప్ర‌జ‌ల‌కు తెలియ‌కుండా పోయింది.

మ‌రోవైపు మిలిటరీ తిరుగుబాటుకు వ్యతిరేకంగా వ్య‌తిరేకిస్తూ వేలాది మంది ప్ర‌జ‌లు విధుల్లోకి వ‌చ్చారు. దీంతో చాలా చోట్ల ఘ‌ర్ష‌ణ‌లు త‌లెత్తాయి. వారిని నిలువ‌రించేందుకు సైన్యం కాల్పులు సైతం జ‌రిపింది. దీంతో చాలా మందిగాయ‌ప‌డ్డారు.

సుడాన్​లో తాజా పరిణామాలపై అమెరికా, ఐరోపా సమాఖ్య ఆందోళన వ్యక్తం చేశాయి. దేశంలో పరిస్థితులు చూసి దిగ్భ్రాంతికి గురైనట్టు సుడాన్​ కు అమెరికా ప్రత్యేక రాయబారి జెఫ్రి ఫెల్ట్​మన్​ తెలిపారు. దేశంలో సైనిక తిరుగుబాటుతో పరిస్థితులు మరింత దారుణంగా మారతాయన్నారు.

ALSO READ Mask Rule Violators : మాస్క్ పెట్టుకోనివారి నుంచి ఒక్క సిటీలోనే రూ. 77కోట్లకు పైగా జరిమానా వసూలు