Tarzan Star Dead :సరస్సులో కూలిన విమానం.. టార్జాన్ స్టార్ దుర్మరణం
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ప్రైవేట్ జెట్ విమానం ఓ సరస్సులో కూలడంతో ఏడుగురు దుర్మరణం చెందారు. ప్రమాదంలో చనిపోయిన వారిలో

Tarzan Star Dead
Tarzan Star Dead: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ప్రైవేట్ జెట్ విమానం ఓ సరస్సులో కూలడంతో ఏడుగురు దుర్మరణం చెందారు. ప్రమాదంలో చనిపోయిన వారిలో టార్జాన్ స్టార్ జో లారా తోపాటు ఆయన సతీమణి గ్వెన్ కూడా ఉన్నారు. మృతదేహాలను సరస్సు నుంచి వెలికితీశారు. మొత్తం ఏడుగురు వ్యక్తుల పేర్లను అధికారులు విడుదల చేశారు.
బాధితులు జెన్నిఫర్ జె. మార్టిన్, డేవిడ్ ఎల్. మార్టిన్, జెస్సికా వాల్టర్స్, జోనాథన్ వాల్టర్స్ మరియు బ్రాండన్ హన్నాతో పాటు జో మరియు గ్వెన్ ఉన్నారు. శనివారం ఉదయం టెన్నెస్సి నుంచి ఫ్లోరిడాలోని పామ్ బీచ్ కు వెళ్తుండగా.. అక్కడ 11 గంటల సమయంలో విమానం ప్రమాదానికి గురైంది. దీంతో వారు మృత్యువాత పడ్డారు. కాగా 58 ఏళ్ల జో లారా టార్జాన్ సిరీస్ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.