సగం కుక్క-సగం పులి : అంతరించిపోయిందనుకుంటున్న ఈ వింత జంతువుపై ఎన్నో సందేహాలు

సగం కుక్క-సగం పులి : అంతరించిపోయిందనుకుంటున్న ఈ వింత జంతువుపై ఎన్నో సందేహాలు

Tasmanian Tigers

Tasmanian tigers : ఈ ప్రపంచంలో జరుగుతున్న మార్పుల వల్ల ఇప్పటికే ఎన్నో రకాల జంతువులు..జీవులు..అంతరించిపోయాయి. ఇంకా మరెన్నో జాతులు అంతరించిపోవటానికి ఆఖరి దశలో ఉన్నాయి.దీనిపై పర్యావరణవేత్తలు గగ్గోలు పెడుతున్నా ఎటువంటి ఫలితాల కనిపించటంలేదు. కానీ అందరించిపోయాయనుకునే జీవులు కనిపిస్తే ఎంత ఆనందమో కదా..అటువంటి ఓ అరుదైన వింత జంతువు కనిపించి కనువిందు చేసింది. ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం అంటే 85 ఏళ్ల క్రితం అందరించిపోయిందనుకున్న ‘‘సగం కుక్క-సగం పులి’లా ఉండే ఓ వింత జంతువు స్థానిక ప్రజలకు కనిపించింది…!!

1

 

ఆస్ట్రేలియాలోని తస్మానియా ప్రజలు 85 ఏళ్ల క్రితం అంతరించిపోయిన జీవిని చూశామని చెబుతున్నారు. ఈ వింత జీవి… సగం కుక్కలా… మరో సగం పులిలా కనిపించే తస్మానియన్ టైగర్ కనిపించింది. ఈ వింత జంతువు ఆస్ట్రేలియాలోని తస్మానియా ప్రాంతంలో కనిపించేది. కానీ ఇది గత ఎనిమిదిన్నర దశాబ్దాలుగా కనిపించకుండాపోయింది. కానీ 85ఏళ్ల తరువాత తిరిగి కనిపించటంతో తస్మానియా ప్రజలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

2

ఇది ఇన్ని దశాబ్దాలుగా కనిపించకుండాపోవటంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా అది అంతరించిపోయిందని 1936లోనే ప్రకటించింది. ఆస్ట్రేలియాలోని థిలాసిన్ అవేర్‌నెస్ గ్రూప్ ప్రెసిడెంట్ నీల్ వాటర్స్ ఇటీవల ఈ తస్మానియన్ టైగర్‌ ఫ్యామిలీని అడవుల్లో చూశామని ప్రకటించారు. ఈ జీవికి సంబంధించిన ఫొటోలను కూడా చూపించారాయన.

6

ఈ సందర్భంగా నీల్ వాటర్స్ మాట్లాడుతూ తన దగ్గర తస్మానియన్ టైగర్‌కు సంబంధించిన నాలుగు ఫొటోలు ఉన్నాయని..అవి తస్మానియన్ టైగర్ కుటుంబానికి చెందినవని తెలిపారు. దీంతో అంతరించిపోయిందనుకునే జంతువు కనిపించిందనే తెలిసేసరికి వన్యప్రాణి ప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

5

కానీ కొన్ని వారాల తరువాత సైంటిస్టుల పరిశోధనల అనంతరం నీల్ వాటర్స్ దగ్గరున్న ఫొటోలు అబద్ధమని తేలింది. ఇదేవిధంగా 2005లో ఎగిరే మాంసాహార ఉడుత ఇదేనంటూ ఒక ఫొటో హల్‌చల్ చేసింది. 2007, 2011, 2014లలోనూ ఇటువంటి విచిత్ర జీవులకు సంబంధించిన ఫొటోలు ప్రత్యక్షమయ్యాయి. పలు పరిశోధనల్లో ఈ ఫొటోలు ఫేక్ అని తేలాయి.