Spain : తల్లిదండ్రులతో కొట్లాట.. సొరంగం నిర్మించుకున్న యువకుడు

ఒక సంవత్సరం కాదు..రెండు సంవత్సరాలు కాదు..ఆరేళ్ల పాటు..అదే పనిలో నిమగ్నమై..భూగర్భంలోనే సొంత ఇంటి నిర్మించుకున్నాడు. ఇంట్లో అన్ని సదుపాయాలు కల్పించుకున్నాడు. పడుకోవడానికి బెడ్డూ..వైఫై సౌకర్యం కల్పించుకున్నాడు.

Spain : తల్లిదండ్రులతో కొట్లాట.. సొరంగం నిర్మించుకున్న యువకుడు

Spain

Teen In Built Underground Den : ఎవరి ఇంట్లో గొడవలు జరుగుతుండడం సహజమే. దీంతో కొంతమంది అలుగుతుంటారు. భోజనం మానేయడమో…బయటకు వెళ్లి తిరగి రావడమో చేస్తుంటారు. అయితే..స్పెయిన్ కు చెందిన ఓ కుర్రాడు మాత్రం ఎవరూ చేయని పని చేశాడు. ఏకంగా సొరంగం తవ్వి..అందులోనే ఉండిపోయాడు. ఒక సంవత్సరం కాదు..రెండు సంవత్సరాలు కాదు..ఆరేళ్ల పాటు..అదే పనిలో నిమగ్నమై..భూగర్భంలోనే సొంత ఇంటి నిర్మించుకున్నాడు. ఇంట్లో అన్ని సదుపాయాలు కల్పించుకున్నాడు. పడుకోవడానికి బెడ్డూ..వైఫై సౌకర్యం కల్పించుకున్నాడు.

స్పెయిన్ లో అండ్రెన్ కాంబో నివాసం ఉంటున్నాడు. 2015 మార్చిలో తల్లిదండ్రులతో గొడవ పడ్డాడు. అప్పుడు అతని వయస్సు 14 సంవత్సరాలు. కోపంతో ఇంట్లో వెనకున్న పెరట్లో..తాత ఉపయోగించి..పార చేతబట్టి తవ్వడం ప్రారంభించాడు. ఇలా ప్రతి రోజు తవ్వుతూనే ఉన్నాడు. ఆరేళ్ల పాటు శ్రమించి..భారీ సొరంగం నిర్మించుకున్నాడు. 2018 వరకు తవ్వి మట్టిని బయటపడే వేసేవాడు.

అండ్రెన్ కు ఓ ఫ్రెండ్ సహకరించాడు. వారానికి 14 గంటల పాటు శ్రమించి సొరంగం తవ్వాడు. అండర్ గ్రౌండ్ ఇంటిని ట్విట్టర్ వేదికగా పోస్టు చేయడంతో తెగ వైరల్ అయిపోయింది. బయట ఎంత వేడిగా ఉన్నా..లోపల మాత్రం చల్లగా ఉందని అండ్రెన్ వెల్లడిస్తున్నాడు. వానా కాలంలో పురుగులు, నత్తలు వస్తాయని తెలిపాడు.

Read More : Petrol Price : తెలుగు రాష్ట్రాల్లో సెంచరీ దాటిన పెట్రోల్ ధర