Whale Vomit: తిమింగలం 30కిలోల వాంతి.. రూ.10కోట్లు వచ్చిపడ్డాయ్!!

రోజుకు చేపలు పట్టడం ద్వారా కనీసం రూ.20వేలు సంపాదించే నారోంగ్ ఫేచరాజ్.. ఈ సారి జాక్ పాట్ కొట్టేశాడు. ఇంటికి తిరిగొస్తుండగా వింతైన వస్తువు కనిపించింది.

Whale Vomit: తిమింగలం 30కిలోల వాంతి.. రూ.10కోట్లు వచ్చిపడ్డాయ్!!

Fisher Man

Whale Vomit: ‘సిరితా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగిన్’ అన్నట్లు అదృష్టం ఎలా వచ్చిపడుతుందో తెలీదు.. కోట్లు కుమ్మరిస్తుంది. థాయ్‌లాండ్‌లోని చేపల పట్టే వ్యక్తికి వాంతు ద్వారా రూ.10కోట్లు వచ్చాయి.

రోజుకు చేపలు పట్టడం ద్వారా కనీసం రూ.20వేలు సంపాదించే నారోంగ్ ఫేచరాజ్.. ఈ సారి జాక్ పాట్ కొట్టేశాడు. రోజూలాగే సూరత్ థానీ ప్రాంతంలోని నియోమ్ బీచ్ నుంచి ఇంటికి తిరిగొస్తుండగా వింతైన వస్తువు కనిపించింది. దగ్గరకు వెళ్తున్న కొద్దీ అర్థమైంది అది తిమింగళం చేసుకున్న వాంతు అని. అప్పటికీ అతనికి దాని విలువ తెలీదు.

దానిని నిపుణులకు అప్పగించి ఎంతో కొంత డబ్బు వస్తుందని భావించాడు. సోంగ్లా యూనివర్సిటీకి చెందిన నిపుణులు చూపించాడు. దానిని ambergrisగా గుర్తించారు. మగ తిమింగళం దీనిని జీర్ణించుకోలేక సముద్రం వెలుపలి ప్రాంతంలో వాంతి చేసుకుని ఉంటుందని నిర్ధారణకు వచ్చారు. ఆ పదార్థం బయటి వాతావరణానికి గట్టి పడి దాదాపు 30కిలోల ఘన పదార్థంగా మారిపోయింది.

……………………………………………………….: గుడ్లు పెడుతున్న దోమ వీడియో..ఇంట్రెస్టింగ్ వీడియో

దీనిని పర్ ఫ్యూమ్ తయారీలో వాడతారు. మగ తిమింగళాల జీర్ణ వ్యవస్థలో ఈ వ్యాక్స్ వంటి పదార్థం ఉత్పత్తి అవుతుంది. ఇంతటి విలువ పలుకుతుంది కాబట్టి ambergrisను సముద్ర నిధిగా పిలుస్తుంటారు. ఒక్కో కేజీ రూ.1కోటి పలికిన సందర్భాలు కూడా ఉన్నాయి.