Oil Spill: సముద్ర తీరంలో ఆయిల్ స్పిల్, విపత్తుగా ప్రకటించిన థాయిలాండ్
థాయిలాండ్ సముద్రం తీరం గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ లో జనవరి 25న ఆయిల్ లీకైన ఘటనను విపత్తుగా ప్రకటించింది ఆ దేశ ప్రభుత్వం.

Oil Spill
Oil Spill: థాయిలాండ్ సముద్రం తీరం గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ లో జనవరి 25న ఆయిల్ లీకైన ఘటనను విపత్తుగా ప్రకటించింది ఆ దేశ ప్రభుత్వం. స్టార్ పెట్రోలియం రిఫైనింగ్ పబ్లిక్ కంపెనీ లిమిటెడ్ SPRCకి చెందిన ఆయిల్ రిగ్ పైప్ లైన్ పగిలిపోవడంతో సుమారు 50,000 లీటర్ల ముడిచమురు సముద్ర తీరంలో ఒలికిపోయింది. దీంతో ఆయిల్ స్పిల్ వ్యాప్తిని అరికట్టేందుకు థాయిలాండ్ నావికాదళం.. SPRC సిబ్బందితో కలిసి తీవ్రంగా శ్రమిస్తోంది. ఆయిల్ రిగ్ పైప్ లైన్ లో చోటుచేసుకున్న చిన్న పొరపాటు కారణంగా 50 వేల లీటర్ల ముడిచమురు బయటకు పొంగుకుని వచ్చినట్లు ప్రాధమికంగా నిర్ధారించారు. రిగ్ ను వెంటనే తమ ఆధీనంలోకి తెచ్చుకున్న సిబ్బంది..తప్పిదాన్ని గ్రహించి రిగ్ ను ఆపివేశారు.
జనవరి 25న చోటుచేసుకున్న ఈ ఘటన తాలూకు దృశ్యాలు, ఫోటోలు సామజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమవడంతో..విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనపై థాయిలాండ్ మొదటి నావల్ ఏరియా కమాండ్ డిప్యూటీ కమాండర్ రియర్ అడ్మిరల్ ఆర్టోర్న్ చరపిన్యో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. సముద్రంలో ఒలికిపోయిన చమురు మరింత వ్యాప్తి చెందకుండా నియంత్రణలోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. ఆయిల్ ను పీల్చేందుకు జుట్టు పోగులు, ఇతర రసాయనాలను ఉపయోగిస్తున్నారు.
Also read:IPL 2022: 25శాతం ప్రేక్షకులతో ఐపీఎల్ మ్యాచ్‌లు
ఆయిల్ స్పిల్ ను నియంత్రించి, సముద్ర తీరాన్ని శుభ్రం చేసేందుకు 150 SPRC సిబ్బంది, 200 మంది నావికాదళ సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు. నౌకాదళానికి చెందిన పన్నెండు నౌకలు మరియు మూడు పౌర నౌకలు, హెలికాఫ్టర్లను గస్తీలో ఉంచారు. ఇంతకు ముందు, అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా తీరంలో ఇలాంటి సంఘటన జరిగింది అప్పట్లో ఆ ఘటనను “పర్యావరణ విపత్తు”గా అభివర్ణించారు. సముద్రంలో చమురు ఒలికిపోవడం వల్ల చేపలు, సముద్ర జీవులు మరియు పక్షులు ప్రమాదంలో చిక్కుకుంటాయి.
Also read: New Smart Phone: Flipkartలో మైక్రోమ్యాక్స్ IN Note 2 సేల్ ప్రారంభం