థాయ్‌లాండ్‌లో ప్లాస్టిక్ నిషేధం : సరుకులు ఎలా పట్టుకెళ్తున్నారో చూడండీ 

  • Published By: veegamteam ,Published On : January 8, 2020 / 07:28 AM IST
థాయ్‌లాండ్‌లో ప్లాస్టిక్ నిషేధం : సరుకులు ఎలా పట్టుకెళ్తున్నారో చూడండీ 

మంచి కోసం మార్పును థాయ్‌లాండ్‌వాసులు చక్కగా అమలు చేస్తున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించటం కోసం థాయ్ వాసులు చక్కగా పాటిస్తున్నారు. ఇంట్లో వస్తువులతో పాటు ఏదీ కాదు సరుకులు వేసుకుని పట్టుకెళ్లటానికి అనర్హం అన్నట్లుగా థాయ్ వాసులు మార్కెట్ల నుంచి సరుకులు పట్టుకెళ్లే విధానాన్ని చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

d 1 
బకెట్స్, పూల కుండీలు, వెదురు బుట్టలు, బట్టలు తగిలించుకునే హ్యాంగర్స్, చెత్తను తరలించే బళ్లు, గన్నీ బ్యాగ్స్, ఇంట్లో వంట చేసుకునే పెద్ద పెద్ద వంట పాత్రలు, సూట్ కేసులు, మాసిన బట్టలు వేసుకునే బుట్టలు, పక్షుల్ని పెంచుకునే పంజరాలు,  ఇలా ఒకటేమిటి అన్నింటిని సరుకులు పట్టుకెళ్లటానికి  ఉపయోగిస్తున్నారు. ఆఖరికి  రోడ్డు మధ్యలో ట్రాఫిక్ డైవర్డ్ కోసం  పెట్టేవాటితో కూడా సరుకుల్ని పట్టుకెళుతున్నారు. 

d 3

2020 కొత్త సంవత్సరానికి థాయ్ లాండ్ కొత్తగా వెల్కమ్ చెప్పింది. జనవరి 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించింది. దీనికి ప్రజల నుంచి చాలా మంచి స్పందన వచ్చింది. షాపింగ్ మాల్స్ లో ప్లాస్టిక్ బ్యాగ్స్ ఇవ్వరు.
దీంతో ప్రజలు సూపర్ మార్కెట్స్ నుంచి షాపుల నుంచి థాయ్ వాసులు వినూత్నంగా సరుకులు పట్టుకెళ్లే విధానం చూసి నెటిజన్స్ ఫిదా అయిపోతున్నారు. వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. భఠా థాయ్ వాసులు అంటూ అభినందిస్తున్నారు. భలే థాయ్ ప్రజలు భలే తెలివైనవారే అంటున్నారు మరికొందరు.

d7