Mosquito Tornadoes : సుడిగాలిలా దూసుకొచ్చిన దోమల దండు..!

దోమలంటే భయమా? అయితే రష్యాలో మాత్రం వెళ్లకండి.. సుడిగాలిలా దోమల దండు దూసుకొచ్చింది. టొర్నడోలుగా కూడా పిలుస్తారు. ఎప్పుడైనా దోమల టోర్నడోలు చూశారా?

Mosquito Tornadoes : సుడిగాలిలా దూసుకొచ్చిన దోమల దండు..!

Mosquito Tornadoes

Mosquito Tornadoes : దోమలంటే భయమా? అయితే రష్యాలో మాత్రం వెళ్లకండి.. సుడిగాలిలా దోమల దండు దూసుకొచ్చింది. టొర్నడోలుగా కూడా పిలుస్తారు. ఎప్పుడైనా దోమల టోర్నడోలు చూశారా? అర్జంటేనియాలో దోమల దండు సుడిగాలి ఒక్కసారిగా విజృంభించింది. ఇప్పుడు రష్యాలో ఈ దృశ్యం కనిపించింది. మబ్బుల తరహాలో దట్టంగా జట్టుకట్టి సుడిగాలిలా దూసుకొస్తోంది. సూర్యుడిని సైతం కమ్మేసింది. ఈ దోమల దండు. ఈ నెల 17న రష్యాలో కనిపించింది.

రష్యాలోని కమ్చట్కా క్రాయ్ (Ust-Kamchatsk) ప్రాంతంలో ఓ వ్యక్తికి ఈ దోమల సుడిగాలి కనిపించింది. ఆ దృశ్యాన్ని ఫోన్ లో రికార్డు చేశాడు. ఈ వీడియో తీస్తూ సుడిగాలి దగ్గరగా వెళ్లాడు. అది సుడిగాలి కాదు. దోమల దండు.


ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇప్పుడా వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ దోమలు కుట్టే దోమలు కాదని అంటుంటే.. ఒకవేళ కుట్టే దోమలు అయితే ఇంకేమైనా ఉందా? అంటూ భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరలో ప్లేగు వ్యాధి వస్తుందనడానికి ఇదే ముందస్తు హెచ్చరిక అంటున్నారు.