Transgender In UK : యూకేలో లింగమార్పిడికి పెరిగిన డిమాండ్.. పురుషులుగా మారాలనుకుంటున్న స్త్రీలు

ఇంగ్లండ్ లో లింగమార్పిడికి బారీగా డిమాండ్ పెరిగింది. చాలా మంది స్త్రీలు..పురుషులుగా మారేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దేశంలో లింగమార్పిడి సర్జరీ చేయించుకునేవారు అధిక సంఖ్యలో ఉండటంతో విదేశాలకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు.

Transgender In UK : యూకేలో లింగమార్పిడికి పెరిగిన డిమాండ్.. పురుషులుగా మారాలనుకుంటున్న స్త్రీలు

transgender in the UK

Transgender In UK : ఇంగ్లండ్ లో లింగమార్పిడికి బారీగా డిమాండ్ పెరిగింది. చాలా మంది స్త్రీలు..పురుషులుగా మారేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దేశంలో లింగమార్పిడి సర్జరీ చేయించుకునేవారు అధిక సంఖ్యలో ఉండటంతో విదేశాలకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. దీనికోసం నేషనల్ హెల్త్ సర్వీస్ నిధులు సమకూర్చాలని ట్రాన్స్ జెండర్ల హక్కుల కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. నేషనల్ హెల్త్ సర్వీస్ అనేది ఇంగ్లండ్ లో పబ్లిక్ గా నిధులు సమకూర్చే ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ.

కాగా, ఇంగ్లండ్ లో వివిధ ప్రమాదాల్లో పురుషాంగం దెబ్బతిన్న చాలా మంది పురుషులు లింగమార్పిడి లేదా పురుషాంగాన్ని పునర్నిర్మించే ఫాలోప్లాస్టీ సర్జరీ కోసం క్యూ కట్టారు. యూకేలో కేవలం న్యూ విక్టోరియా హాస్పిటల్ లో మాత్రమే ఈ సర్జరీ చేస్తున్నారు. కరోనా వైరస్ వల్ల ఫాలోప్లాస్టీ పెండింగ్ జాబితా పెరిగిపోయింది. దీంతో వీరందరికీ సర్జరీ చేయాలంటే కనీసం నాలుగేళ్లైనా పడుతుంది. అయితే అంత సమయం తాము వేచి ఉండలేమని, ఫాలోప్లాస్టీ కోసం తమన విదేశాలకు పంపించాలని డిమాండ్ చేస్తున్నారు.  ఈ సర్జరీకి రూ.21 లక్షల ఖర్చు అవుతుంది.

Odisha : కుమార్తెకు లింగమార్పిడి ఆపరేషన్ చేయించిన ఐపీఎస్ దంపతులు

విదేశాలకు వెళ్లి లింగమార్పిడి చేయించుకునేందుకు క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఈ మొత్తాన్ని సేకరించాలని కొంతమంది నిర్ణయం తీసుకున్నారు. ఈ సర్జరీ కోసం బ్రిటన్ లో మొత్తం రెండు వేల మంది క్యూ కట్టినట్లు ట్రాన్స్ జెండర్ల హక్కుల కోసం పోరాడే ట్రాన్సాక్ఛువల్ గ్రూప్ అంచనా వేసింది.
ఫాలోప్లాస్టీ అనగా పురుషాంగాన్ని పునర్నిర్మించటం లేదా పురుషాంగాన్ని సృష్టించడం. రోగి చర్మంపై అంటుకట్టే పద్దతి ద్వారా పురుషాంగాన్ని కృత్రిమంగా పునర్నిర్మిస్తారు.

పురుషాంగం విస్తరణ ఆపరేషన్, పురుషాంగం పొడవు, వెడల్పును పంచే సర్జరీ, పురుషాంగాన్ని పునర్నిర్మించే సర్జరీ. ఈ విధంగా మూడు రకాలు ఉంటాయి. వ్యక్తి శరీరంలోని ముంజేయి లేదా తొడ భాగంలో పురుషాంగాన్ని గ్రాఫ్టింగ్ ద్వారా పునర్నిర్మిస్తారు. దీన్ని కత్తిరించి సర్జరీ ద్వారా మూత్రాశయానికి జోడించనున్నారు. రక్తనాళాలు, నాడిని అనుసంధానం చేసి, అంగస్తంభన కలిగేలా చేస్తారు.