హ్యాట్సాఫ్ ఫ్రొఫెసర్ : 71 ఏళ్ల వయసులోనూ ప్రాక్టికల్ టీచింగ్

ఆయన పేరు డేవిడ్ రైట్. ఫిజిక్స్ ప్రొఫెసర్. వయసు 71 ఏళ్లు. ప్రస్తుతం డేవిడ్ రైట్ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారారు. దీనికి కారణం ఆయన

  • Published By: veegamteam ,Published On : December 15, 2019 / 08:17 AM IST
హ్యాట్సాఫ్ ఫ్రొఫెసర్ : 71 ఏళ్ల వయసులోనూ ప్రాక్టికల్ టీచింగ్

ఆయన పేరు డేవిడ్ రైట్. ఫిజిక్స్ ప్రొఫెసర్. వయసు 71 ఏళ్లు. ప్రస్తుతం డేవిడ్ రైట్ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారారు. దీనికి కారణం ఆయన

ఆయన పేరు డేవిడ్ రైట్. ఫిజిక్స్ ప్రొఫెసర్. వయసు 71 ఏళ్లు. ప్రస్తుతం డేవిడ్ రైట్ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారారు. దీనికి కారణం ఆయన టీచింగ్ చేసే విధానమే. అవును.. డేవిడ్ రైట్.. స్టూడెంట్స్ కు ఇచ్చే టీచింగ్ తీరు చాలా ప్రత్యేకం. సాధారణంగా టీచర్లు.. జస్ట్.. పుస్తకాలు చదివి బోధన చేస్తారు. బుక్ లో ఏముందో అది మాత్రమే వివరిస్తారు. బోర్డుపై రాసి వెళ్లిపోతారు. కానీ.. డేవిడ్ రైట్ అలా కాదు. ఆయన అంతా ప్రాక్టికల్ గా ఉంటారు. క్లాస్ రూమ్ నే ప్రయోగశాలగా మారుస్తారు. ప్రతి విషయాన్ని ప్రయోగాత్మకంగా విద్యార్థులకు వివరిస్తారు. చెప్పడం కన్నా కళ్లారా చూపిస్తేనే.. బాగా అర్థం చేసుకుంటారు అనే సిద్దాంతాన్ని డేవిడ్ రైట్ విశ్వసిస్తారు.

వర్జీనియాలోని టైడ్‌వాటర్ కమ్యూనిటీ కాలేజీలో.. ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా డేవిడ్ రైట్ పని చేస్తున్నారు. డేవిడ్ బోధనా విధానం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఫిజిక్స్‌ను ఎలా అప్లయ్ చేయొచ్చో చెబుతూ ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తారు. అందుకే.. ప్రొఫెసర్ డేవిడ్ రైట్ టీచింగ్ అంటే స్టూడెంట్స్ చాలా ఇష్టపడతారు.

న్యూటన్ రెండో సిద్ధాంతాన్ని రుజువు చేసేందుకు మేకులు ఉన్న పరుపుపై పడుకుని విద్యార్థులకు చూపించారు డేవిడ్ రైట్. గ్రావిటీ గురించి అర్థమయ్యేందుకు పోగో స్టిక్ వినియోగించి చూపించారు. ఒక మూస ధోరణిలో పాఠాలు చెబితే స్టూడెంట్స్ కు నచ్చదన్న సత్యం తెలుసుకున్న డేవిడ్ రైట్… బోధనలో కొన్ని ఫన్ అంశాలను జోడించి సరదాగా పాఠాలు చెబుతారు. విద్యార్థుల్లో ఏ దశలోనూ ఇంట్రెస్ట్ తగ్గకుండా కేవలం సబ్జెక్ట్‌పై ఫోకస్ చేసేలా జాగ్రత్తలు తీసుకుంటారు.

క్లాస్‌రూమ్ లో ప్రాక్టికల్ గా డేవిడ్ రైట్ టీచింగ్ చేస్తుండగా.. ఎరిక్ అనే విద్యార్థి తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేసింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతే..71 ఏళ్ల ప్రొఫెసర్‌ ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. ఇంటర్నెట్‌ సంచలనంగా మారారు. డేవిడ్ రైట్ టీచింగ్ వీడియోకి నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. ఈ వీడియోకు మిలియన్ల వ్యూస్, లైక్స్ వచ్చాయి. 

డేవిడ్ రైట్ చెప్పే పాఠాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తారు. ఎప్పుడెప్పుడు డేవిడ్ రైట్.. క్లాస్‌ రూమ్ కి వస్తారా, ఆయన పాఠాలు విందామా అని ఉత్సాహం చూపుతారు. 71 ఏళ్ల వయస్సులోనూ 17 ఏళ్ల కుర్రాడిలా డేవిడ్ రైట్ ఎంతో యాక్టివ్‌గా కనిపించడం అందరిని అట్రాక్ట్ చేసింది. ప్రొఫెసర్ డేవిడ్ రైట్ తన బోధన తీరుతో స్టూడెంట్స్ మనసులే కాదు.. నెటిజన్ల మనసులూ గెలుచుకున్నారు. హ్యాట్సాఫ్ మాస్టార్ అంటూ కితాబిస్తున్నారు.