ట్రాన్స్‌జెండర్‌ దొంగ జైలు‌శిక్ష తప్పించుకుంది : కారణం ఏంటంటే?

10TV Telugu News

చిన్నదైన ట్రాన్స్ జెండర్‌ల సమాజం ప్రపంచంలో కొన్ని ఇబ్బందులు పడుతుంది. ట్రాన్స్ జెండర్‌ల విషయంలో ఎప్పుడు కూడా వివక్ష ఉంటుంది. ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె మహిళ అని నిరూపించడానికి తగిన పేపర్లు లేకపోవడంతో.. ఆమెను మహిళల జైలుకు పంపలేదు. అలాగే మగవాళ్ల జైలుకు పంపే అవకాశం లేదు. దీంతో ఆరు నెలల శిక్ష పడినా కూడా ఆమె గంటలోనే విడుదలైంది. 

వివరాల్లోకి వెళ్తే..  బ్రిగ్టన్‌లోని బడ్జెన్స్ వద్ద వైన్ దొంగిలించేందుకు షాపు కార్మికుడిని సుత్తితో బెదిరించినందుకు లీలా లే ఫే అనే వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది కోర్టు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే ట్రాన్స్ జెండర్ తరపు న్యాయవాది రెబెక్కా ఆప్టన్ వాదిస్తూ.. లే ఫే తన లింగ నిర్ధారణకు సంబంధించిన ధృవీకరించబడిన ఆధారాలు లేవని వెల్లడించారు. (కరోనా దెబ్బకు కాలుష్యం మాయం…ఎందుకంటే!)

ఈ క్రమంలోనే జైలు నిబంధనల ప్రకారం లే ఫేను ఏకాంత నిర్బంధంలో ఉంచలేమని ఎంఎస్ ఆప్టన్ లెవెస్ క్రౌన్ కోర్టుకు తెలిపారు. ఇక లే ఫే తన లింగత్వాన్ని నిరూపించగల ఏకైక మార్గం పరీక్షలు చెయ్యడమే. ఇది చెయ్యడానికి కోర్టు సిబ్బంది సిద్ధంగా లేదట, దీంతో ఆమెను విడుదల చేసేశారు అధికారులు.

10TV Telugu News