Whale Of Fortune : తిమింగలం కడుపులో రూ.44 కోట్ల అంబర్‌గ్రిస్ నిధి!
కానరీ దీవుల్లోని లా పాల్మాలోని నోగలెస్ బీచ్‌లో పడి ఉన్న మృత తిమింగలం కడుపులో రూ.44కోట్ల విలువైన నిధిని గుర్తించిన ఘటన సంచలనం రేపింది. నోగలెస్ బీచ్‌లో నిర్జీవంగా పడిఉన్న తిమింగలాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

Whale Of Fortune
Treasure Worth Rs 44 Crore Discovered : కానరీ దీవుల్లోని లా పాల్మాలోని నోగలెస్ బీచ్‌లో పడి ఉన్న మృత తిమింగలం (dead whale) కడుపులో రూ.44కోట్ల విలువైన నిధిని గుర్తించిన ఘటన సంచలనం రేపింది. నోగలెస్ బీచ్‌లో నిర్జీవంగా పడిఉన్న తిమింగలాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ తిమింగలం జీర్ణ రుగ్మత సమస్య వల్ల మరణించిందని కళేబరం పరీక్షలో వెల్లడైంది. ఈ భారీ జీవి అయిన తిమింగలం అవశేషాలను పరిశీలించిన శాస్త్రవేత్తలకు దాని అంతర్భాగంలో విలువైన నిధి కనిపించింది. (Dead Mammals Belly)
Boyfriend : యూపీలో బాయ్ ఫ్రెండ్ దారుణం… వివాహితను గర్భవతిని చేసి, ఆపై…
తిమింగలం మరణానికి గల కారణాలను పరిశోధించడానికి లాస్ పాల్మాస్ విశ్వవిద్యాలయంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ హెల్త్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ అధిపతి ఆంటోనియో ఫెర్నాండెజ్ రోడ్రిగ్జ్ ను పిలిచారు. దీని పెద్ద పేగులో ఓ వస్తువు దృడంగా కనిపించింది. దీని కడుపులో నుంచి 50-60 సెంటీమీటర్ల వ్యాసం కల 9.5 కిలోల బరువున్న రాయి బయటపడిందని రోడ్రిగ్జ్ చెప్పారు. ఈ రాయినే అంబర్ గ్రిస్ (Ambergris) అంటారని రోడ్రిగ్జ్ చెప్పారు. అంబర్‌గ్రిస్ అనేది ఒక శాతం కంటే తక్కువ స్పెర్మ్ తిమింగలాలు ఉత్పత్తి చేసే అరుదైన పదార్థం. స్పెర్మ్ తిమింగలాలు సాధారణంగా స్క్విడ్, కటిల్ ఫిష్‌లను తింటాయి. కానీ అవి తినే ప్రతిదాన్ని పూర్తిగా జీర్ణించుకోలేవు. దీని అవశేషాలు కాలక్రమేణా కడుపులో పేరుకుపోయి ఘనీభవిస్తాయి. దాంతోనే అంబర్‌గ్రిస్ తయారవుతోంది.
Meritorious Students : అసోంలో మెరిట్ విద్యార్థులకు స్కూటర్లు… సీఎం ప్రకటన
అంబర్‌గ్రిస్ పెద్దదైతే, అది తిమింగలం మరణానికి దారితీస్తోంది. తిమింగలం పేగులో దాగి ఉన్న ఈ విలువైన రహస్య పదార్థాన్ని సముద్రం లేదా తేలియాడే బంగారం అని కూడా అంటారు. అంబర్‌గ్రిస్ ను సుగంధ ద్రవ్యాల తయారీలో వాడతారు. మార్కెట్లో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది. తిమింగలాల కడుపులో తయారయ్యే దీనిని అవి వాంతి రూపంలో బయటకు పంపుతాయి. దీనిని ఫ్లోటింగ్ గోల్డ్ (floating gold)గానూ వ్యవహరిస్తారు. రోడ్రిగ్జ్ వెలికితీసిన అంబర్‌గ్రిస్ ముద్ద విలువ రూ.44 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు. యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా, భారతదేశం వంటి దేశాల్లో అంబర్‌గ్రిస్ తో వ్యాపారం చేయడం నిషేధించారు.