Taliban Ruling: ఒకప్పుడు టీవీ యాంకర్, వీధుల్లో ఫుడ్ అమ్ముకుంటూ జీవనం

దైనందిన జీవితంలో జీవన పోరాటం చేస్తూ, కుటుంబం కోసం కష్టాలు పడే వారిని చాలా మందిని చూస్తుంటాం. కొన్ని దేశాల్లో అధికారుల పాలన ప్రభావంతో మరికొందరి పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది. అలాగే తయారైంది అఫ్ఘానిస్తాన్ లోని తాలిబాన్ల పాలన.

Taliban Ruling: ఒకప్పుడు టీవీ యాంకర్, వీధుల్లో ఫుడ్ అమ్ముకుంటూ జీవనం

Tv Anchor

 

 

Taliban Ruling: దైనందిన జీవితంలో జీవన పోరాటం చేస్తూ, కుటుంబం కోసం కష్టాలు పడే వారిని చాలా మందిని చూస్తుంటాం. కొన్ని దేశాల్లో అధికారుల పాలన ప్రభావంతో మరికొందరి పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది. అలాగే తయారైంది అఫ్ఘానిస్తాన్ లోని తాలిబాన్ల పాలన. వాళ్ల ఎఫెక్ట్‌తో ఒకప్పుడు పలు ఛానెల్స్ లో రిపోర్టర్‌గా, టీవీ యాంకర్‌గా పనిచేసిన వ్యక్తి వీధి వ్యాపారిగా మారాడు.

హమీద్ కర్జయ్ ప్రభుత్వం ఉన్న సమయంలో యాంకర్ చేసిన పనులను వెల్లడిస్తూ.. ఇప్పుడు కుటుంబ పోషణ కోసం దయనీయంగా వీధుల్లో ఆహారం అమ్ముకుంటున్నాడంటూ పోస్టు పెట్టాడు. అఫ్ఘానిస్తాన్ లో నెలకొన్న ఆర్థిక పరిస్థితి దాని నుంచి బయటపడేందుకు ఇలా చేయాల్సి వస్తుందని చెప్తున్నాడు.

“మూసా మొహమ్మదీ యాంకర్‌గా, రిపోర్టర్‌గా పలు టీవీ ఛానెల్స్ కు పనిచేశాడు. ఇప్పుడు తన కుటుంబ పోషణకు డబ్బు లేకపోవడంతో వీధుల్లో ఆహారం అమ్మి కొంత డబ్బు సంపాదిస్తున్నాడు. కొత్త పాలనలో అఫ్ఘాన్లు ఇలా బాధలు పడుతున్నారు’ అంటూ మరో కబీర్ అఖ్మల్ అనే వ్యక్తి క్యాప్షన్ తో పోస్టు చేశాడు.

Read Also: ఇస్లాంను అవమానిస్తున్నాడని తాలిబాన్ల చేతిలో అఫ్ఘాన్ మోడల్ అరెస్ట్

మొహమ్మదీ కథ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ప్రజల దృష్టిని ఆకర్షించింది. నేషనల్ రేడియో అండ్ టెలివిజన్ డైరెక్టర్ జనరల్ అహ్మదుల్లా వాసిక్, మాజీ టీవీ యాంకర్, రిపోర్టర్‌ను అపాయింట్ చేసుకున్నట్లు ట్వీట్ చేశారు.

“ఒక ప్రైవేట్ టెలివిజన్ స్టేషన్ ప్రతినిధి మూసా మొహమ్మదీ నిరుద్యోగం గురించి సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది. వాస్తవానికి, నేషనల్ రేడియో అండ్ టెలివిజన్ డైరెక్టర్‌గా, నేషనల్ రేడియో అండ్ టెలివిజన్ ఫ్రేమ్‌వర్క్‌లో అతన్ని నియమిస్తామని అతనికి హామీ ఇస్తున్నా” అని వాసిక్ సోషల్ మీడియా పోస్ట్ లో పేర్కొన్నారు.