Twin Mother : 40 ఏళ్లకే 44మంది పిల్లల్ని కన్నతల్లి..నీకో దణ్ణం..ఇక కనటం ఆపేయమన్న ప్రభుత్వం..!

 ఒకరిద్దరు పిల్లల్ని కని వారినిపెంచటమే పెద్ద టాస్క్ . కానీ ఓమహిళ ఏకంగా 44 మంది పిల్లల్ని కనేసింది.అదికూడా 40 ఏళ్ల వయస్సు వచ్చేసరికే. కేవలం 13ఏళ్ల వయస్సులోనే పిల్లల్ని కనటం ప్రారంభించింది. అన్ని కాన్పులు కవలపిల్లలే. అలా 40 ఏళ్లు వచ్చేసరికి 44మంది పిల్లలకు జన్మనిచ్చింది..!!

Twin Mother : 40 ఏళ్లకే 44మంది పిల్లల్ని కన్నతల్లి..నీకో దణ్ణం..ఇక కనటం ఆపేయమన్న ప్రభుత్వం..!

40 Years 44 Childrence

Uganda 40 Years Woman 44 Children : ఒకరిద్దరు పిల్లల్ని కని వారినిపెంచటమే పెద్ద టాస్క్ గా ఉన్న ఈరోజుల్లో ఓమహిళ ఏకంగా 44 మంది పిల్లల్ని కనేసింది.అదికూడా 40 ఏళ్ల వయస్సు వచ్చేసరికే. అంటే ఆమె ఏ వయస్సులో పిల్లల్ని కనటం మొదలుపెట్టి ఉంటుందో అనే పేద్ద డౌటు వచ్చే ఉంటుంది. ఆమెకు కేవలం 13ఏళ్ల వయస్సులోనే పిల్లల్ని కనటం ప్రారంభించింది. అదికూడా కవలపిల్లలు.

ఆఫ్రియా దేశాల్లోని ఉగాండా దేశానికి చెందిన మరియం నబాతంజి  13ఏటే ఆమెకు కవల పిల్లలు పుట్టారు. అలా మొదలైంది ఆమె పిల్లల్ని కనే ప్రక్రియ. మరో కాన్పులో ముగ్గురు పిల్లలు. అలా నాలుగు కాన్పుల్లో ముగ్గురు ముగ్గురు పిల్లలు పుట్టేశారు. అంతమంది పిల్లలు కనటం ఎందుకు చక్కగా ఆపరేషన్ చేయించుకోవచ్చు కదాని అంటారు. కానీ ఆమెకు ఆ అవకాశం లేదు. గర్భనిరోధక ఆపరేషన్ చేయటం కుదరదని చెప్పారు డాక్టర్లు. తన 13 ఏళ్ల వయస్సులోనే కవలపిల్లలు పుట్టినప్పుడు డాక్టర్ల వద్దకెళ్లి తనకు గర్భనిరోధక ఆపరేషన్ చేయమని అడిగింది. ఆమెను పరీక్షించిన డాక్టర్లు అది సాధ్యం కాదని చెప్పారు. అలా మొదలైంది ఆమె పిల్లల్ని కనే ప్రక్రియ. అలా ఆమెకు 40 ఏళ్లు వచ్చేసరికి ఏకంగా 44మంది పిల్లల్ని కనేసింది.

అంతమంది పిల్లల్ని కన్న మరియం గురించి తెలిసిన ప్రభుత్వం ఏకంగా ఆమెకు ఆదేశాలు జారీ చేసింది. ‘‘తల్లో నీకో దణ్ణం..పిల్లల్ని కనటం ఆపేయమ్మా.’’అని. ఏంటీ అదేదో పిల్లల్ని కనే యంత్రంలా ఆ కనటం ఏంటీ అంటూ.

ఆమెకు మొదటిసారి 13వ ఏట కవలపిల్లలు పుట్టినప్పుడు మరియమ్మ డాక్టర్ల వద్దకెళ్లింది..తనకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయమని..మాది పేద కుటుంబం పిల్లలు పెంచలేం సార్ అంటూ..దానికి మరియంకు ఆపరేషన్ చేద్దామనుకున్నాడు డాక్టర్లు. దానికి ఆమెకు పరీక్షలు కూడా చేశారు. కానీ డాక్టర్లే షాక్ అయ్యారు. ఎందుకంటే ఆమెకు ఆపరేషన్ చేయటం కుదరదని చెప్పారు. ఆమె అండాశయాలు చాలా పెద్దగా ఉన్నాయని తెలిపారు.

అలా ఆమెను పరీక్షించిన డాక్టర్లు భవిష్యత్తులో ఆమెకు మరింతమంది కవలలు పుడతారని చెప్పారు. దానికి కారణం ఆమెకు ఒకేసారి అనేక అండాలు విడుదల కావటంతో కవలపిల్లలు పుడతారని తెలిపారు. డాక్టర్లు చెప్పినట్లుగానే మరియమ్మకు పలు కాన్పుల్లో ఇద్దరు నుంచి నలుగురు పిల్లలు పుట్టారు. తొలికాన్పులోనే కవలపిల్లలకు జన్మనిచ్చిన మరియమ్మ..ఆ తరువాత ఆరు కాన్పుల్లో కవలలను..నాలుగు కాన్పుల్లో ముగ్గురేసి చొప్పున మొత్తం 44మంది పిల్లలకు జన్మనిచ్చింది.వీరిలో ఆరుగురు పిల్లలు పుట్టగానే చనిపోయారు. అలా ప్రస్తుతం మరియమ్మకు 38మంది పిల్లలు ఉన్నారు.

ఇంతమంది పిల్లల్ని సాకటం ఆమెకు కష్టంగా ఉన్నా చాలా ప్రేమగా చూసుకుంటోంది. కానీ ఇంతమందిని నిన్ను నేను పోషించలేనంటూ ఆమె భర్త వదిలేశాడు. దీంతో అంతమంది పిల్లలు పెంచి పోషించటం మరియమ్మమీద పడింది. అసలు ఉగాండా కరవు తాండవించే దేశం. దీంతో అంతమంది పిల్లల్ని పెంచి పోషించటం ఆమెకు చాలా కష్టంగా మారింది. రెక్కలు ముక్కలు చేసుకున్నా..వారి కడుపులు నింపటం చాలా కష్టమైపోతోంది ఆ సంతానలక్ష్మికి.

అయినా బిడ్డలను ఆకలితో ఉంచలేనంటోందా తల్లి. అమ్మ మనస్సు అంటే అంతేమరి. వారి కోసం రెక్కలు ముక్కలు చేసుకుంటోంది.దయచేసి నా పిల్లలను పోషించుకోవటానికి ఓదారి చూపించమని..ప్రభుత్వం ఆదుకోవాలని కోరిందా తల్లి. దానికి ప్రభుత్వం ఓ కండిషన్ పెట్టింది. ఇక నువ్వు పిల్లల్న కనటం ఆపేస్తే సహాయం చేస్తామని తెలిపింది. దీనికి మరియమ్మ ‘‘నా భర్త నన్ను వదిలేశాడు..ఇక పిల్లల్ని కంటే నీ ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్లు తెలిపారు..ఇక నేను పిల్లల్ని కనలేను సార్’’అని చెప్పింది.

ఇకపై పిల్లల్నికనను అనే షరతు మీద ఆమెకు ప్రభుత్వం సహాయం చేయటానికి ముందుకొచ్చింది. ప్రపంచంలోనే అత్యంత పేదరికాన్ని అనుభవిస్తున్న దేశాల్లో ఉగాండా కూడా ఒకటి అనే విషయం తెలిసిందే. కానీ అంత పేదరికంలో కూడా ఆమె పిల్లలను పెంచుకుంటోంది..స్కూలుకూడా పంపిస్తోంది.