Pfizer Vaccine: ‘5 ఏళ్లు దాటిన వారికి ఫైజర్ వ్యాక్సిన్ ఇవ్వొచ్చు’

అయిదేళ్లు దాటిన చిన్నారులకు ఫైజర్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు అనుమతిచ్చేసింది అమెరికా ప్రభుత్వం. యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిన ఎమర్జెన్సీ యూసేజ్ ప్రకారం..

Pfizer Vaccine: ‘5 ఏళ్లు దాటిన వారికి ఫైజర్ వ్యాక్సిన్ ఇవ్వొచ్చు’

Pfizer For Kids

Pfizer Vaccine: అయిదేళ్లు దాటిన చిన్నారులకు ఫైజర్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు అనుమతిచ్చేసింది అమెరికా ప్రభుత్వం. యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిన ఎమర్జెన్సీ యూసేజ్ ప్రకారం.. ఫైజర్ కొవిడ్ వ్యాక్సిన్ ను ఐదు నుంచి 11ఏళ్ల మధ్య వయస్కులకు ఇవ్వొచ్చు. ఈ అప్రూవల్ తో దేశంలోని సుమారు 2.8 కోట్ల మంది చిన్నారులు లబ్ధి పొందనున్నారు.

హై లెవల్ మెడికల్ టీం ఇచ్చిన స‌ల‌హా మేర‌కు గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకుంది. చైనా, చిలీ, క్యూబా, యూఏఈ దేశాలు ఇప్ప‌టికే చిన్నారుల‌కు టీకాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. త‌ల్లిగా, ఓ డాక్ట‌ర్‌గా ఈ సంద‌ర్భం కోసం ఎదురుచూస్తున్న‌ట్లు యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్ర‌గ్ అడ్మినిస్ట్రేష‌న్ చీఫ్ జానెట్ వుడ్‌కాక్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

పిల్ల‌ల‌కు టీకాలు ఇవ్వ‌డం వ‌ల్ల కొవిడ్‌-19 అదుపులోకి వ‌చ్చే అవ‌కాశాలు ఉన్న‌ట్లు అభిప్రాయపడ్డారు. దీని కోసం అమెరికా దేశంలో పిల్ల‌ల కోసం 5 కోట్ల కోవిడ్ డోసులను సిద్ధంగా ఉంచిన‌ట్లు ఫైజ‌ర్ సంస్థ అధికారికంగా తెలిపింది.

……………………………………: పునీత్ మాకు దేవుడి కన్నా ఎక్కువ..!

సుమారు 2 వేల మందికి వ్యాక్సిన్ ఇచ్చి క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌ నిర్వహించారు. 90 శాతం మందిలో పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. 3 వేల మంది చిన్నారులపై వ్యాక్సిన్ సేఫ్టీ గురించి స్ట‌డీ చేశారు. ఫలితంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవ‌ని గుర్తించారు. వ‌యోజ‌నుల్లో వ‌చ్చే తీవ్ర‌మైన కోవిడ్ ల‌క్ష‌ణాలు పిల్ల‌ల్లో లేవని తెలిసిందట.

క‌రోనా మ‌హ‌మ్మారి మొదలైన నాటి నుంచి 5 నుంచి 11 ఏళ్ల వ‌య‌సున్న వారిలో 8వేల 300 మంది చిన్నారులు హాస్పిటల్ పాలవగా 146 మంది ప్రాణాలు కోల్పోయారు.