కేటుగాళ్లా మజాకా : డ్రగ్స్ స్మగ్లింగ్ కోసం ఏకంగా భారీ సొరంగానే తవ్వేశారు

  • Published By: veegamteam ,Published On : January 31, 2020 / 06:42 AM IST
కేటుగాళ్లా మజాకా : డ్రగ్స్ స్మగ్లింగ్ కోసం ఏకంగా భారీ సొరంగానే తవ్వేశారు

మెక్సికన్ నగరమైన టిజువానాలో స్మగ్లర్లు డ్రగ్స్ తరలించటానికి స్మగ్లర్లు ఏకంగా ఓ భారీ సొరంగాన్నే తవ్వేశారు. టిజువానా నుంచి  కాలిఫోర్నియాలోని శాన్ డియాగో ప్రాంతం వరకూ ఈ సొరంగాన్ని తవ్వేశారు. ఈ సొరంగాన్ని మెక్సికో అధికారులు గుర్తించారు. మెక్సికో బోర్డర్ లో ఇదే అతి పెద్ద సొంరంగం అని తెలిపారు.

రెండు అడుగుల వెడల్పు, ఐదున్నర అడుగుల ఎత్తులో అత్యంత నేర్పుగా దీన్ని తవ్వారనీ..4,309 అడుగుల పొడవున్న ఈ రహస్య మార్గంలో ఓ లిఫ్ట్, రైల్వే ట్రాక్, డ్రైనేజీ, ఎయిర్ వెంటిలేటర్లు, హై ఓల్టేజ్ విద్యుత్ కేబుళ్లు తదితర అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారని అధికారులు తెలిపారు. దీన్ని నిర్మించటానికి ఎంత సమయం పట్టిందో  
 
ఈ సొరంగం కాలిఫోర్నియాలోని శాన్ డియాగో నుంచి మెక్సికోలోని టిజువానా పారిశ్రామిక ప్రాంతాన్ని కలుపుతూ ఈ సొరంగాన్ని నిర్మించారు. కాగా ఈ సొరంగానికి సంబంధించిన ఎవరినీ అరెస్ట్ చేయలేదనీ.. ఇందులో ఎలాంటి డ్రగ్స్ స్వాధీనం చేసుకోలేదని అధికారులు వెల్లడించారు.

మెక్సికోతో కాలిఫోర్నియా సరిహద్దులో 2016 నుండి 12కు  పైగా అధునాతన సొరంగాలు కనుగొనబడ్డాయి. 2014 లో శాన్ డియాగోలో కనుగొనబడిన యుఎస్ లో రెండవ అతి పొడవైన సొరంగం 2,966 అడుగుల పొడవు ఉందని సిబిపి తెలిపింది.

ఇటీవలి కనుగొన్న యుఎస్-మెక్సికో సరిహద్దు సొరంగాలు
ఆగష్టు 2018: అరిజోనా రాష్ట్రంలోని మాజీ కెఎఫ్‌సి నుండి మెక్సికో వరకు 600 అడుగుల సొరంగం విస్తరించి ఉంది. 
ఏప్రిల్ 2016: కొకైన్ మరియు గంజాయి యొక్క “అపూర్వమైన కాష్” ను రవాణా చేయడానికి శాన్ డియాగోలోని ఒక అధునాతన సొరంగం ఉపయోగించబడిందని అధికారులు తెలిపారు.
మార్చి 2016: మెక్సికోలోని రెస్టారెంట్ నుండి కాలిఫోర్నియాలోని ఒక ఇంటికి ఒక సొరంగం నడిచింది
ఆగస్టు 2015: టిజువానాలో పట్టాలు, లైటింగ్ మరియు వెంటిలేషన్ ఉన్న అసంపూర్తి సొరంగం కనుగొనబడింది.

కాగా..ప్రపంచంలోని అతి పెద్ద మాదకద్రవ్యాల రవాణా సంస్థలలో ఒకటిగా అమెరికా ప్రభుత్వం అభివర్ణించిన మెక్సికోకు చెందిన సినలోవా కార్టెల్ ఈ ప్రాంతంలో యాక్టివ్ గా ఉంది. ఈ సంస్థను స్థాపించిన జోక్విన్ ఎల్ చాపో గుజ్వాన్ యూఎస్ జైల్లో శిక్షను అనుభవిస్తున్నాడు.