అమెరికా చరిత్రలోనే తొలిసారి..ట్రాన్స్‌జెండర్‌కు ప్రభుత్వంలో కీలక పదవి

అమెరికా చరిత్రలోనే తొలిసారి..ట్రాన్స్‌జెండర్‌కు ప్రభుత్వంలో కీలక పదవి

Us Senate Confirms Transgender Doctor Key Post (1)

us senate confirms transgender doctor key post : అమెరికా చరిత్రలోనే తొలిసారిగా ఒక ట్రాన్స్‌జెండర్‌కు అరుదైన గౌరవం లభించింది. జోబైడెన్ అధ్యక్షుడు అయిన తరువాత అమెరికా ప్రభుత్వంలో ట్రాన్స్‌జెండర్‌కు కీలక పదవి లభించింది. అధ్యక్షుడు జోబైడెన్‌కు ఆరోగ్య రంగంలో సహాయకురాలిగా రాచెల్‌ లెవీన్‌ అనే ఓ ట్రాన్స్ జెండర్ నియామకానికి అమెరికా సెనేట్‌ బుధవారం (మార్చి 24,2021) ఆమోద ముద్ర వేసింది.

1

lgbt కమ్యూనిటీ (Lesbian, gay, bisexual, and transgender)హక్కుల్ని పరిరక్షిస్తానని ఎన్నికల ప్రచారంలోనే మాట ఇచ్చిన జో బైడెన్‌ 2021 జనవరిలోనే రాచెల్‌ను అత్యున్నత పదవికి సిఫారసు చేశారు. lgbt కమ్యూనిటీపై ఉండే వివక్ష సంకెళ్లను బద్దలు కొడుతూ బైడెన్‌ తీసుకున్న నిర్ణయానికి సెనేట్‌ మద్దతు ప్రకటించింది. రాచెల్‌ లెవీన్‌ నియామకాన్ని 52–48 ఓట్లతో సెనేట్‌ ఖరారు చేసింది.

2

ఇద్దరు రిపబ్లికన్‌ సెనేటర్లు కూడా రాచెల్‌కు మద్దతు ఇవ్వటం గమనించాల్సిన విషయంగా చెప్పుకోవాలి. పెన్సిల్వేనియా స్టేట్‌ కాలేజీ ఆఫ్‌ మెడిసన్‌ పీడియాట్రీషన్‌గా పనిచేస్తున్న 63 ఏళ్ల రాచెల్‌ ఆరోగ్య రంగంలో అసిస్టెంట్‌ సెక్రటరీగా కరోనా వైరస్‌పై పోరాటానికి ఏర్పాటు చేసిన బృందానికి నేతృత్వం వహిస్తారు.

8

పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఆరోగ్య శాఖలో పని చేస్తూ కరోనా కేసుల కట్టడిలో ఆమె చూపించిన ప్రతిభా పాటవాల్ని గుర్తించిన బైడెన్‌ రాచెల్‌ను ఈ పదవికి ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. కాగా రాచెల్ లివిన్ నియామకాన్ని చారిత్రాత్మక పురోగతి అని లింగమార్పిడి-హక్కుల కార్యకర్తలు జో బైడెన్ ను ఆయన ప్రభుత్వాన్ని ప్రశంసించారు.