Spelling Bee Winner Dev Shah : అమెరికా ‘స్పెల్లింగ్ బీ’ విజేతగా భారత సంతతికి చెందిన 14 ఏళ్ల బాలుడు

24 ఏళ్లల్లో ఈ పోటీల్లో గెలిచిన 22వ దక్షిణాసియా సంతతి వ్యక్తిగా ప్రతిభ కనబరిచాడు. ఇది నేను నమ్మలేకపోతున్నానని.. ఇప్పటికీ నా కాళ్లు వణుకుతున్నాయని అన్నాడు.

Spelling Bee Winner Dev Shah : అమెరికా ‘స్పెల్లింగ్ బీ’ విజేతగా భారత సంతతికి చెందిన 14 ఏళ్ల బాలుడు

US Spelling Bee Winner Dev Shah

US Spelling Bee Winner Dev Shah : భారత సంతతికి చెందిన 14ఏళ్ల బాలుడు ‘స్పెల్లింగ్ బీ’ విజేతగా నిలిచాడు. 50,000 అమెరికన్ డాలర్లు గెలుచుకున్నాడు. అమెరికాలో జరిగిన నేషనల్ స్పెల్లింగ్ బీ (US Spelling Bee) 2023 పోటీలో విజేతగా దేవ్ షా విజేతగా నిలిచి గత 24 ఏళ్లల్లో ఈ పోటీల్లో గెలిచిన 22వ దక్షిణాసియా సంతతి వ్యక్తిగా ప్రతిభ కనబరిచాడు. దేవ్ షా శామాఫైల్‌ (psammophile) అనే పదానికి స్పెల్లింగ్‌ చెప్పి 50,000 డాలర్ల ప్రైజ్‌ మనీని గెలుచుకొన్నాడు.

అమెరికాలో నిర్వహించిన 95వ నేషనల్‌ స్పెల్లింగ్‌ బీ పోటీల్లో భారత సంతతికి చెందిన 14 ఏళ్ల దేవ్‌షా 11 అక్షరాల పదం శామాఫైల్‌ (psammophile) అనే పదానికి స్పెల్లింగ్‌ చెప్పి 50,000 డాలర్లు గెలుచుకున్నాడు. శామాఫైల్‌ (psammophile) అంటే ఇసుక నేలల్లో కనిపించే కనిపించే జీవి లేదా మొక్క అని అర్థమట.

Viral Video: స్టేజీపై బొక్కబోర్లా పడిపోయిన అమెరికా అధ్యక్షుడు జోబైడెన్

దేవ్ షా 2019,2021లో నిర్వహించిన ఈ పోటీల్లో పాల్గొన్నాడు. 2019లో 51వ స్థానంలోను, 2021లో 76వ స్థానంతో సరిపెట్టకోగా పట్టుదలతో 2023లో ఛాంపియన్ గా నిలిచాడు. గత 24 ఏళ్లల్లో ఈ పోటీల్లో దక్షిణాసియా వారసత్వంతో స్పెల్లింగ్ బీలో 22వ ఛాంపియన్ గా కూడా నిలిచాడు. ఈ పోటీలో గెలుపొందాక ట్రోఫీని అందుకున్న దేవ్ షా మాట్లాడుతు.. ఇది నేను నమ్మలేకపోతున్నానని.. ఇప్పటికీ నా కాళ్లు వణుకుతున్నాయి’’ అని అన్నాడు.తమ బిడ్డ సాధించిన ఈ ప్రతిభకు దేవ్ షా తల్లిదండ్రులు తీవ్ర భావోద్వేగానికి గురి అయ్యారు. మా బిడ్డను చూసి గర్వపడుతున్నామని తెలిపారు.

దేవ్ షా తండ్రి దేవల్ 29 ఏళ్ల క్రితం భారత్ నుంచి అమెరికా వెళ్లి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తు.. అక్కడే సెటిల్అయ్యారు. కుమారుడు దేవ్ షా సాధించిన ఈ ఘతన గురించి దేవల్‌ మాట్లాడుతూ.. దేవ్ మూడో ఏట నుంచి స్పెల్లింగ్ చెప్పటంలో చక్కటి ప్రతిభకనబరిచేవాడని అది గుర్తించి ఆ దిశగా ప్రోత్సహించామని తెలిపారు. అలా భారత్ లో పిల్లలకు స్కాలర్ షిపుల్లో అందించే సంస్థ ది నార్త్ సౌత్ ఫౌండేషన్ నిర్వహించిన పోటీల్లో పాల్గొన్నాడని తెలిపారు.

Elon Musk: మళ్లీ నెంబర్ వన్ స్థానానికి ఎగబాకిన ఎలాన్ మస్క్.. ఆ దెబ్బతో రెండో స్థానంలోకి అర్నాల్ట్

ఇక ఈ పోటీల్లో రన్నరప్ గా వర్జీనియాకు చెందిన 14ఏళ్ల బాలిక ఛార్లెట్‌ వాల్ష్‌ నిలిచారు. మొత్తం 231 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. వీరిలో 11 మంది ఫైనల్స్‌కు చేరుకొన్నారు. కాగా.. శామాఫైల్‌ (psammophile) అనే పదం గ్రీకు నుంచి వచ్చింది. ప్సమ్మో అంటే ఇసుక అని ఫిలే అంటే ప్రేమ అని అర్థం.