How To Avoid WhatsappBan : వాట్సాప్ యూజర్లకు వార్నింగ్.. ఇలా చేస్తే, వాట్సాప్ వాడలేరు..!

మీ వాట్సాప్ ఖాతా నిషేధానికి గురి కావొద్దంటే ఏం చేయాలి? మార్గాలు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏయే పనులు చేయకూడదు?(How To Avoid WhatsappBan)

How To Avoid WhatsappBan : వాట్సాప్ యూజర్లకు వార్నింగ్.. ఇలా చేస్తే, వాట్సాప్ వాడలేరు..!

How To Avoid Whatsapp Ban

How To Avoid WhatsappBan : ప్రముఖ మేసేజింగ్ యాప్ వాట్సాప్.. నిబంధనలు పాటించని వారిపై కొరడా ఝళిపిస్తోంది. వారి వాట్సాప్ అకౌంట్ పై నిషేధం విధిస్తోంది. గత నెలలో భారత్ లో ఏకంగా 18లక్షల ఖాతాలను బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే. మరి, మీ ఖాతా నిషేధానికి గురి కావొద్దంటే ఏం చేయాలి? మార్గాలు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏయే పనులు చేయకూడదు? అనే విషయానికి వస్తే..

Whatsapp Banned 18 Lakh Indians In 30 Days Find Out Why? How To Avoid Whatsapp Ban?

Whatsapp Banned 18 Lakh Indians In 30 Days Find Out Why? How To Avoid Whatsapp Ban?

వాట్సాప్ ప్లస్, జీబీ వాట్సాప్, వాట్సాప్ మోడ్ వంటి అనధికార యాప్స్ ఉపయోగించకూడదు. అంతేకాదు మీరు ఫార్వార్డ్ చేసే మేసేజ్ లపై ఫిర్యాదులు వచ్చినా మీ అకౌంట్ ని వాట్సాప్ బ్లాక్ చేస్తుంది. కాబట్టి మీరు ఫార్వర్డ్ చేసే మేసేజ్ ల విషయంలో అలర్ట్ గా ఉండండి. ఇక మిమ్మల్ని ఎక్కువమంది వాట్సాప్ లో బ్లాక్ చేసినా మీ వాట్సాప్ అకౌంట్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది.(How To Avoid WhatsappBan)

Whatsapp Multiple Devices : మల్టీపుల్ డివైజ్‌ల్లో వాట్సాప్ అకౌంట్ Unlink చేయండిలా..!

ఇలా చేయడం వల్ల మీ ఖాతా నిషేధించబడుతుంది..

* నకిలీ ఖాతాను సృష్టించడం
* మీ కాంటాక్ట్స్ లో లేని వారికి చాలా ఎక్కువ సందేశాలు పంపడం.
* WhatsApp డెల్టా, GBWhatsApp, WhatsApp Plus మొదలైన థర్డ్ పార్టీ యాప్స్ పక్ష యాప్‌లను ఉపయోగించడం.
* పోర్న్ క్లిప్‌లు, బెదిరింపు లేదా పరువు నష్టం కలిగించే సందేశాలు పంపడం.
* హింసను ప్రోత్సహించే నకిలీ సందేశాలు లేదా వీడియోలను పంపడం.(How To Avoid WhatsappBan)

Whatsapp Multiple Devices : మల్టీపుల్ డివైజ్‌ల్లో వాట్సాప్ అకౌంట్ Unlink చేయండిలా..!

నిబంధనలు అతిక్రమిస్తున్న యూజర్లపై వాట్సాప్‌ కఠినంగా వ్యవహరిస్తోంది. వివిధ వర్గాల నుంచి వచ్చిన ఫిర్యాదులు, సొంత మెకానిజం ద్వారా నిబంధనలు అతిక్రమిస్తున్న ఖాతాలపై వేటు వేస్తోంది. తాజాగా 2022 మార్చిలో 18 లక్షల భారతీయుల ఖాతాలను బ్లాక్‌ చేసినట్టు వాట్సాప్‌ ప్రకటించింది.

Whatsapp Banned 18 Lakh Indians In 30 Days Find Out Why? How To Avoid Whatsapp Ban?

Whatsapp Banned 18 Lakh Indians In 30 Days Find Out Why? How To Avoid Whatsapp Ban?

భారత ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన ఐటీ చట్టాల ప్రకారం 50 లక్షల కంటే ఎక్కువ మంది ఖాతాదారులు ఉన్న సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌ గ్రీవెన్స్‌ను స్వీకరించడంతో పాటు నిబంధనలు అతిక్రమించే వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వివరాలను ఎప్పటికప్పుడు ప్రకటించాల్సి ఉంది. కాగా 2022 మార్చిలో ఏకంగా 18 లక్షల ఖాతాలను బ్లాక్‌ చేసినట్టు వాట్సాప్‌ ప్రకటించింది. అంతకు ముందు ఫిబ్రవరిలో 14.26 లక్షల ఖాతాలపై కొరడా ఝులిపించింది.

WhatsApp Support : వాట్సాప్ యూజర్లకు వార్నింగ్.. సపోర్ట్‌తో పేరుతో కొత్త తరహా మోసం

రెచ్చగొట్టేలా, విద్వేషాలు ఉసిగొల్పేలా, ఇతరుల స్వేచ్ఛ, గౌరవానికి భంగం కలిగించే ఖాతాలపై నిఘా పెట్టామని వాట్సాప్‌ తెలిపింది. ఇటువంటి వారిని గుర్తించేందుకు ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ను ఎప్పటికప్పుడు అభివృద్ధి చేస్తున్నట్టు వెల్లడించింది.