WHO: ఆంక్షలు ఎత్తేస్తే.. వ్యాక్సిన్ తీసుకోని వారికి ప్రమాదం!

కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుంది. ప్రపంచ దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయడంతో కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుంది.

WHO: ఆంక్షలు ఎత్తేస్తే.. వ్యాక్సిన్ తీసుకోని వారికి ప్రమాదం!

Who Suggest To All Cuntries About Travel Rules

who suggest to all cuntries about travel rules: కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుంది. ప్రపంచ దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయడంతో కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయా దేశాలు ప్రయాణాలపై విధించిన నిబంధనలను సడలించాలని ఆలోచనలో ఉన్నాయి. ఈ తరుణంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రపంచ దేశాలను హెచ్చరించింది. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న ప్రమాదకరమైన వేరియంట్లు విజృంభిస్తున్న తరుణంలో నిబంధనలు సడలిస్తే వ్యాక్సిన్ తీసుకోని ప్రజలు చాలా ఇబ్బంది పడతారని పేర్కొంది.

ఈ మేరకు డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధానమ్ ఒక ప్రకటన విడుదల చేశారు. చాలా దేశాలు అందరికి వ్యాక్సిన్ అందించలేని స్థితిలో ఉన్నాయని వాటిని కూడా దృష్టిలో ఉంచుకొని ప్రయాణాలపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

Read:West Bengal : మెరుపులు,పిడుగుల బీభత్సం..20 మంది మృతి