Wildlife Photographer: వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ అడుగుల దూరంలో సింహం.. భయంతో కేకలు వేసినా

ఓ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ కాలిఫోర్నియా ట్రిప్ లో ఉండగా ఓ భయానక ఘటన చోటు చేసుకుంది. అతని కళ్లెదురుగానే కొద్ది అడుగుల దూరంలో సింహం నిల్చొని చూస్తూ ఉంది.

Wildlife Photographer: వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ అడుగుల దూరంలో సింహం.. భయంతో కేకలు వేసినా

Wild Photo

Wildlife Photographer: ఓ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ కాలిఫోర్నియా ట్రిప్ లో ఉండగా ఓ భయానక ఘటన చోటు చేసుకుంది. అతని కళ్లెదురుగానే కొద్ది అడుగుల దూరంలో సింహం నిల్చొని చూస్తూ ఉంది. మార్క్ గిరిర్డియో, అతని ఫ్రెండ్ రాచెల్ దె లుగ్త్ అడవిలో తిరుగుతూ ఒక్కసారిగా పొదల్లో ఉన్న సింహాన్ని చూశారు. వైల్డ్ లైఫ్ ను క్యాప్చర్ చేద్దామని వచ్చిన వారికి అంత దగ్గర్లో క్రూరమృగం చూసి షాక్ అయ్యారు.

సరిగ్గా 20 అడుగుల దూరంలో కనిపించిన సింహాన్ని ఆపలేరు. అలా అని పరిగెత్తలేరు. చాకచక్యంగా వ్యవహరించిన ఫొటోగ్రాఫర్.. అక్కడే నిలబడి పెద్దపెద్ద శబ్దాలు చేయడం మొదలుపెట్టారు. గట్టిగా అరుస్తూ.. వెళ్లిపో, వెళ్లిపో అంటూ కేకలు వేశారు.  చాలాసేపు వరకూ అక్కడే ఉండి గమనించి తర్వాత వెనక్కు మళ్లింది.

అదే అదనుగా భావించి నిదానంగా జారుకున్నారు. ఆ వీడియోను సోషల్ మీడియాలోను పోస్టు చేశారు. ‘ నా ఫ్రెండ్ అక్కడే ఉన్నాడు కాబట్టి బతికిపోయాం. ఒంటరిగా ఉంటే మాత్రం కచ్చితంగా పరిగెత్తి సింహానికి బలైపోయేదాన్నేమో.. అని చెప్పారు గిరిర్డియో.

………………………………………………….. : తిట్టాడని కారుకు నిప్పెట్టాడు!

ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఆ సింహం దగ్గర్లోనే వేటాడి ఏదో జంతువును తినేసింది. అందుకోసం కాస్త నిదానంగా కదులుతుంది. ఇంకొకటి కింద నుంచి చూడటంతో మమ్మల్ని స్పష్టంగా అంచనా వేయలేకపోయింది. దగ్గర్లో దుప్పి ఉండటం మేం చూశాం. మమ్మల్ని కూడా అదే అనుకుని ఉండొచ్చు’ అని ఆ ఫొటోగ్రాఫర్ చెప్పుకొచ్చారు.