చైనా సూపర్ పవర్ కావాలనే కుట్ర చేసిందా? ప్రపంచాన్ని కరోనాతో భయపెట్టి డ్రాగన్ చేసిన వ్యాపారం చూస్తే కళ్లు తిరిగిపోతాయ్!

  • Published By: sreehari ,Published On : April 12, 2020 / 01:32 PM IST
చైనా సూపర్ పవర్ కావాలనే కుట్ర చేసిందా? ప్రపంచాన్ని కరోనాతో భయపెట్టి డ్రాగన్ చేసిన వ్యాపారం చూస్తే కళ్లు తిరిగిపోతాయ్!

ఒక దేశం సూపర్ పవర్ కావాలన్నా , ప్రపంచం మీద తన పట్టు పెంచుకోవాలన్నా, అదంతా ఆర్ధిక వ్యవస్థ మీదే ఆధారపడి ఉంది. అమెరికా పరిస్థితి ఇప్పుడు చాలా దయనీయంగా ఉంది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకు రాజధానిగా పేరుపడ్డ న్యూయార్క్ కరోనా గుప్పిట్లో చిక్కుకుంది. పూర్తిగా లాక్ డౌన్ లో ఉంది. అక్కడ ఆర్ధిక కార్యకలాపాలు ఆగిపోయి చాలా రోజులయ్యింది. అమెరికాలో కరోనా విజృంభణకు ముందే చైనా అవకాశాన్ని అందిపుచ్చుకుంది.

షేర్ మార్కెట్లపై కన్నేసిన డ్రాగన్ :
టపటపా పడిపోతున్న షేర్ మార్కెట్ పై కన్నేసింది. అమెరికా , ఐరోపా దేశాల దేశాల కంపెనీల షేర్లు కారు చవగ్గా కొనేసింది. కరోనా కారణంగా రానున్న ఆరు నెలల్లో అమెరికా , ఐరోపా దేశాల్లో ఆర్ధిక మాంద్యం తప్పదని నిపుణులు అంచనా వేశారు । 2008 నాటి సంక్షోభం కన్నా ఇది మరింత గడ్డు కాలం కాబోతున్నదని కూడా తేల్చి చెప్పారు .

ప్రపంచ యుద్ధం సంగతి ముందు కరోనా తేల్చవలసి ఉంది ఎందుకంటే చైనా సూపర్ పవర్ అయ్యేదీ లేనిదీ కరోనా తరవాతే తెలుస్తుంది. ఇంత కాలం రెండు బలమైన  దేశాల మధ్య తెర వెనుక సాగుతున్న పోరు కరోనా తరవాత తెర పైకి వస్తుంది కరోనా తరవాత ఈ రెండు దేశాలూ ప్రత్యక్ష ఆర్ధిక పోరుకు తలపడతాయ్ ఈ యుద్ధం లో  చైనా గెలిచినా , సూపర్ పవర్ గా ఎదగాలంటే చైనా అమెరికా తో మరికొంత కాలం పోరాడక తప్పదు.

ప్రపంచానికి భయం అంటగట్టి.. చైనా వ్యాపారంలో బిజీ :
కరోనాను చైనా ప్రపంచానికి పంచింది. కానీ ఒక్క నెలలో కరోనా మీద చైనా చేసిన వ్యాపారం చూస్తే కళ్ళు తిరిగిపోతాయ్. ప్రపంచానికి కరోనా భయాన్ని అంటగట్టి , తాను సూపర్ పవర్ కావాలని చైనా కోరుకుంటోందా ? అందుకు అనుగుణంగా పావులు కదుపుతోందా ? అమెరికా గడగడలాడుతోంది. ఇటలీలో మృత్యు ఘోష వినిపిస్తోంది. స్పెయిన్ కకావికలమైంది. బ్రిటన్ ఐసీయూ లో చేరింది। జర్మనీ , ఫ్రాన్స్ , ఇరాన్ , టర్కీ , స్విట్జర్ ల్యాండ్ , ఆస్ట్రేలియా , ఇండియా సహా ప్రపంచంలోని 190 కి పైగా దేశాల ప్రజలు ఇళ్లల్లో ఖైదీలుగా మారిపోయారు. 

ఇదొక విచిత్రమైన పరిస్థితి నుదుటి మీద ఉష్ణోగ్రతలు, ఊపిరి తీసుకునే వేగం కొలుస్తున్నారు. ఊపిరి తీసుకోవడం కష్టమైన వారిని కరోనా రోగులుగా తేల్చుతున్నారు. ఇప్పటి వరకూ కరోనా బారిన పడని వారు ఊపిరి పీల్చు కుంటున్నారు. బతుకే ఒక పెద్ద సవాలుగా మారింది. బతకడానికి కావలసినవన్నీ బంద్ అయిపోయాయి. కానీ కరోనా వేగం మాత్రం తగ్గలేదు. ప్రపంచం లోని ఆస్పత్రుల్లో ఆక్సిజెన్ నిల్వలు క్రమక్రమంగా తగ్గిపోతున్నాయి. వెంటిలేటర్లు చాలడం లేదు. డాక్టర్లను రక్షించే దుస్తులు కరువైపోయాయి. పరీక్ష కిట్లు సరిపడా లేవు. మాస్కులూ, శానిటైజర్లూ ఎప్పుడో ఖర్చైపోయాయి.

చైనా కపట సాయం.. కరోనా కోరల్లో ప్రపంచం :
కానీ, మూత పడ్డ ప్రపంచంలోనే మరో ప్రపంచం తెరుచుకుంది. అక్కడ బజార్లన్నీ కళకళ్లాడుతున్నాయ్. బిజినెస్ యధావిధిగా సాగిపోతోంది. మనిషి బతుకూ, దాన్ని నడిపించే ఊపిరి కూడా వేగంగానే కదులుతున్నాయి. అదొక విచిత్రమైన ప్రపంచం. రోగగ్రస్థమైన ప్రపంచానికి వైద్య చికిత్సలూ, చికిత్స పరికరాలూ అది అమ్ముతోంది. మొన్నటి వరకూ తానూ ఆపదలోనే మునిగి తేలింది. మొట్టమొదటిసారిగా  ప్రపంచానికి కరోనా పేరు అక్కడి నుంచే వినిపించింది. లాక్ డౌన్ అన్న మాట కూడా అక్కడి నుంచే వచ్చింది. అలాంటి దేశం ఈ రోగం నుంచి ఇంత త్వరగా ఎలా బయట పడింది? ఇంత త్వరగా మళ్ళీ తన కాళ్లపై తాను ఎలా నిలబడగలిగింది? ప్రపంచ మార్కెట్ల పై తన ఆధిపత్యాన్ని ఎలా సాగించగలుగుతోంది ? 

గాడిన పడిన ఉబెయ్ : వ్యాపారాలతో ఫుల్ బిజీ :
చైనాలోని ఉబెయ్ రాష్ట్రం తిరిగి గాడిన పడింది. ప్రపంచ మార్కెట్ల కోసం తన మార్కెట్లను తెరిచింది. ఫ్యాక్టరీలు 24 గంటలు పనిచేస్తున్నాయి. చైనా ఎగుమతుల శాఖ లెక్కలు ఏమి చెబుతున్నాయో చూడండి. యాభై‌కి పైగా దేశాలకు చైనా 386 కోట్ల మాస్కులు ఎగుమతి చేసింది. 370 కోట్ల భద్రతా దుస్తులు ఎగుమతి చేసింది. అంతే కాదు 16 వేల
వెంటిలేటర్లు వివిధ దేశాలకు ఎగుమతి చేసింది. 20 లక్షల 84 వేల పరీక్ష కిట్లు ఎగుమతి చేసింది. ఈ విదేశీ వర్తకం అంతా చైనా మార్చి ఒకటి నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ మధ్యనే చేసింది. అంటే ఒక్క నెలలోనే ఇదంతా  చేసిందన్న మాట. 

ఇదెక్కడి వింత ? :
ఇదెక్కడి వింత ? కరోనా మహమ్మారి ముందుగా అక్కడే మొదలయ్యింది. అందరికన్నా ముందు అక్కడే వినాశనం సృష్టించింది. ఇప్పుడు ఆ దేశమే కోరోనా నుంచి తనను తాను రక్షించుకోడానికి ప్రపంచానికి తన సరుకులు అమ్ముతోంది. అంతే కాదు, ఈ కష్ట కాలంలో మొత్తం ప్రపంచమే లాక్‌డౌన్‌లో ఉంది. అన్ని దేశాల ఆర్ధిక వ్యవస్థలూ పెను సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి గడ్డు కాలంలో కూడా చైనా ఆర్ధిక వ్యవస్థ రాత్రీ, పగలూ కూడా పట్టాలపై పరుగులు పెడుతోంది.

మరో పక్క కరోనా పై పోరాటానికి అవసరమైన వైద్య పరికరాల తయారీ చైనాలో మరింత వేగం పుంజుకుంది. ఇదంతా చూస్తుంటే చైనా మీద అనుమానం పుట్టుకొస్తోంది. ఒక పక్క చైనా మొత్తం ప్రపంచానికి తన సరుకులు అమ్ముతోంది. మరో పక్క ప్రపంచాన్ని ఆదుకోడానికి అవతరించిన ప్రవక్తలాగా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటోంది. నిజామా ?
ప్రపంచాన్ని ఆదుకోడానికి చైనా ఒక ప్రవక్త లా అవతరించిందా? లేక కథ వేరే ఉందా ? 

కథ వేరే ఉన్నట్లు పరిస్థితులు చెబుతున్నాయ్  చైనా లో కరోనా ప్రాణాంతక మహమ్మారి అత్యంత వేగంగా ప్రబలింది. అంతే వేగంగా చైనా లోని ఉబెయ్ రాష్ట్రాన్ని తన గుప్పెట్లో బంధించింది. తిరిగి అంతే వేగంగా చైనా దాన్ని అదుపులోకి తెచ్చింది ఇదంతా చూస్తుంటే ఆందోళన కలుగుతోంది. ఇందులో మూడు విషయాలున్నాయి.

ఏంటా మూడు విషయాలంటే? : 
ఏంటా మూడు విషయాలు? మొదటిది చైనా తన తప్పుల నుంచి త్వరగా పాఠాలు నేర్చుకుంది. కరోనాను అదుపులోకి తెచ్చింది. లేదా కరోనా వైరస్ గురించి చైనాకు చాలా ముందుగానే తెలిసుండాలి. అందుకే దీన్ని అదుపు చేయడానికి ముందు నుంచే తగిన సన్నాహాలు చేసుకుంది. ఇవన్నీ కాదనుకుంటే మరో అనుమానం పుట్టుకొస్తోంది.
వ్యూహాత్మకంగానే కరోనా వైరస్ ను చైనా సృష్టించింది. ఒక్కొక్కటిగా తన అస్త్రాలను ప్రపంచం మీదికి వదులుతోంది.

చైనాలో కరోనా కేసులు ఇప్పుడు బాగా తగ్గిపోయాయి. ప్రారంభం తో పోల్చుకుంటే అసలు లేనట్లే. కానీ, పశ్చిమ దేశాల్లో, ముఖ్యంగా ఐరోపా, అమెరికా దేశాల్లో పరిస్థితి దారుణంగా మారింది. ఐరోపాలో ఇటలీ, స్పెయిన్, జర్మనీ , ఇంగ్లాండ్ – అటు అమెరికా దేశాలపై కరోనా ప్రభావం అత్యధికంగా ఉంది. తన సొంత లాబొరేటరీల్లో చైనా కరోనా
వైరస్ సృష్టించిందా? తన సరుకులకు డిమాండ్ సృష్టించడానికి ఇదంతా చేసిందా? ఇప్పుడు ఆ డిమాండ్‌కు సరిపడా తన సరుకులు ఎగుమతి చేస్తోందా? కరోనా వెనుక చైనా వ్యూహం తెలుసుకోవాలంటే , ముందు డిమాండ్, సప్లై ఆట గురించి తెలుసుకోవాలి. 

సిల్క్ రోడ్డు సిద్ధం చేస్తోంది : 
హెల్త్ కేర్ , వైద్య సేవల పేరు మీద ముఖ్యమైన దేశాలకు చేరే విధంగా చైనా ఒక సిల్క్ రోడ్డు సిద్ధం చేస్తోందని వార్తలు వస్తున్నాయ్. చైనా ఇప్పటికే ప్రారంభించిన వన్ బెల్ట్, వన్ రోడ్ లాంటిదే ఇది కూడా. రోడ్డు, రైలు, సముద్ర మార్గాల గుండా తూర్పు నుంచి పశ్చిమానికి రాకపోకలు ఏర్పాటు చేయడమే వన్ బెల్ట్ , వన్ రోడ్డు ప్రాజెక్టు లక్ష్యం. దీంతో
మొత్తం ప్రపంచం మీద చైనా తన పట్టు పెంచుకోవాలని చూస్తోంది.

కానీ అమెరికా వంటి కొన్ని పశ్చిమ దేశాలు చైనా కల సాకారం కాకుండా అడ్డుపడ్డాయి. కరోనా ఇప్పుడు చైనాకు మరో అవకాశం కల్పించింది. హెల్త్ కేర్ , వైద్య సేవల ఎగుమతుల పేరుతొ చైనా తన కల నిజం చేసుకునే ప్రయత్నాలు మొదలెట్టింది. చైనా కంపెనీలు అందుకు అవసరమైన సామాగ్రి తయారు చేయడం ఆరంభించాయి. చైనా లోని 50 పెద్ద కంపెనీలు, దేశవ్యాప్తంగా 90 శాతం కంపెనీల్లో ఉత్పత్తి ప్రారంభం అయ్యింది. చైనాలోని 50 శాతం బిజినెస్ సెంటర్లు తెరుచుకున్నాయి. ప్రపంచం లో N – 95 మాస్కులకు భారీ డిమాండ్ ఉంది. అందుకే చైనాలోని తొమ్మిది వేల కంపెనీలు కేవలం మాస్కులు తయారు చేస్తున్నాయి.

అప్పట్లో అమెరికా సూపర్ పవర్ :
ఇది కచ్చితంగా రెండో ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితులను గుర్తు చేస్తోంది. ప్రారంభంలో అనేక దేశాలను అమెరికా యుద్ధానికి ప్రోత్సహించింది. తాను మాత్రం యుద్ధం చేయకుండా, ఆయా దేశాలకు ఆయుధాలు, ఇతర యుద్ధ సామగ్రి ఎగుమతి చేసింది. అందుకే  రెండో ప్రపంచ యుద్ధంలో ప్రపంచం ఓడిపోయింది. కానీ, అమెరికా మాత్రం
గెలిచింది. అమెరికా ఆర్ధిక వ్యవస్థ పుంజుకుంది. అంతే కాదు, అమెరికా సూపర్ పవర్ గా ఎదిగింది.. కాలం తిరగబడింది. 

అదే ఇప్పుడు చైనాకు అలాంటి అవకాశం కల్పించింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా చేసిందే ఇప్పుడు చైనా చేస్తోంది. ముందు నువ్వే డిమాండ్ సృష్టించు. ఆతరవాత నువ్వే సరఫరా చేసి లాభం సంపాదించుకోవాలి. ఇదే చైనా అనుసరిస్తోంది. కానీ చైనా లాభం తోనే ఆగుతుందా లేక అమెరికా తరహాలో సూపర్ పవర్ గా ఎదిగేందుకు వ్యూహం రచిస్తోందా?  ఇవే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితులు కూడా దానికి బలాన్ని కలిగిస్తున్నాయి.