జెన్ సక్సెస్ స్టోరీ : లావుగా ఉందని వరుడు వదిలేశాడు.. కట్ చేస్తే.. మిస్ బ్రిటన్ విన్నర్ అయ్యింది

శ్రమ, కృషి, పట్టుదల ఉంటే అనుకున్నది సాధించలేనిది ఏదీ లేదంటారు. చాలామంది విషయంలో ఇది ప్రూవ్ అయ్యింది. తాజాగా బ్రిటన్ కు చెందిన 26ఏళ్ల జెన్ అట్కిన్(jen atkin)

  • Published By: veegamteam ,Published On : February 27, 2020 / 12:47 AM IST
జెన్ సక్సెస్ స్టోరీ : లావుగా ఉందని వరుడు వదిలేశాడు.. కట్ చేస్తే.. మిస్ బ్రిటన్ విన్నర్ అయ్యింది

శ్రమ, కృషి, పట్టుదల ఉంటే అనుకున్నది సాధించలేనిది ఏదీ లేదంటారు. చాలామంది విషయంలో ఇది ప్రూవ్ అయ్యింది. తాజాగా బ్రిటన్ కు చెందిన 26ఏళ్ల జెన్ అట్కిన్(jen atkin)

శ్రమ, కృషి, పట్టుదల ఉంటే అనుకున్నది సాధించలేనిది ఏదీ లేదంటారు. చాలామంది విషయంలో ఇది ప్రూవ్ అయ్యింది. తాజాగా బ్రిటన్ కు చెందిన 26ఏళ్ల జెన్ అట్కిన్(jen atkin) విషయంలోనూ ఇది నిరూపితం అయ్యింది. 110 కిలోల బరువున్న జెన్ అట్కిన్.. కృషి, పట్టుదలతో బరువు తగ్గింది. రెండేళ్లలో 50 కిలోల వెయిట్ లాస్ అయ్యింది. బొద్దు గుమ్మ కాస్త.. ముద్దు గుమ్మలా మారింది. ఆండాళ్లమ్మను తలపించిన జెన్.. మెరుపు తీగలా తయారైంది. మిస్ గ్రేట్ బ్రిటన్ 2020 పోటీల్లో పాల్గొని.. విన్నర్ గా నిలిచింది.

1

లావుగా ఉందని పెళ్లి క్యాన్సిల్:
జెన్ అట్కిన్.. రెండేళ్ల క్రితం లావుగా ఉండేది. బరువు 110 కిలోలు. చూడటానికి చాలా ఇబ్బందిగా అనిపించేది. డ్రెస్సులు సరిపోయేవి కావు. ఆమె బరువు ఆమెకు మైనస్ అయ్యింది. చివరికి పెళ్లి సంబంధాలు కూడా స్టాప్ అయ్యాయి. ఓ సంబంధం ఆఖరి నిమిషంలో రద్దయింది. నువ్వు చాలా లావుగా ఉన్నావని.. పెళ్లి కొడుకు ఆమెని వదిలేశాడు. దీంతో జెన్ చాలా బాధపడింది. కంటతడి పెట్టింది. నా బతుకు ఎందుకిలా అయ్యిందని ఆవేదన చెందింది. అయితే ఆమె.. తనని తాను నిందించుకుంటూ సైలెంట్ గా ఉండిపోలేదు. ఎలాగైనా బరువు తగ్గాలని డిసైడ్ అయ్యింది. 

2

వారంలో 5 రోజులు జిమ్ లోనే:
వెయిట్ లాస్ పై సీరియస్ గా ఫోకస్ చేసింది జెన్. అది కూడా ఆరోగ్యకరమైన పద్ధతిలోనే. లైపో సెక్షన్ వంటి ప్రమాదకరమైన పద్ధతుల జోలికి వెళ్లకుండా.. శ్రమతో బరువు తగ్గడంపై దృష్టి పెట్టింది. ముందుగా తీసుకునే ఆహారంపై ఫోకస్ చేసింది. హెల్తీ ఫుడ్ మాత్రమే తీసుకోవడం స్టార్ట్ చేసింది. దానికి తోడుగా వ్యాయామం చేయడం ప్రారంభించింది. వారంలో ఐదు రోజులు జిమ్ లోనే గడిపింది. బాగా కసరత్తు చేసింది. చెమట చిందించింది. కొవ్వు కరిగించింది. ఇలా ఎంతో క్రమశిక్షణగా ముందుకు సాగింది. ఆమె శ్రమ వృథా కాలేదు. క్రమంగా వెయిట్ లాస్ అవ్వడం మొదలైంది. ఇలా రెండేళ్లలో 50 కిలోల వరకు బరువు తగ్గింది జెన్ అట్కిన్. 110 కిలోల నుంచి 60 కిలోలకు ఆమె బరువు పడిపోయింది.

రెండేళ్లలో మెరుపు తీగలా తయారైంది:
జెన్ లో ఊహించని మార్పు కనిపించింది. ఆమె ఫిజిక్ సూపర్ గా తయారైంది. అసలు నేనేనా అని తనను తాను చూసుకుని ఆశ్చర్యపోయింది. కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్ సైతం అవాక్కయ్యారు. లావుగా, అంద విహీనంగా ఉన్న జెన్.. మెరుపు తీగలా తయారైంది. ఇదే..ఉత్సాహంతో.. జెన్.. మిస్ గ్రేట్ బ్రిటన్ 2020 పోటీల్లో పాల్గొంది. ఆమె అందానికి జడ్జిలు ఫిదా అయ్యారు. ఈ పోటీల్లో ఫస్ట్ రన్నరప్ గా జెన్ నిలవడం విశేషం.

జెన్ అట్కిన్ సక్సెస్ స్టోరీ:
నాడు అధిక బరువుతో బాధ పడిన జెన్ అట్కిన్.. నేడు మెరుపు తీగలా మారి.. సక్సెస్ సాధించింది. అంద విహీనంగా ఉన్నావని చీదరించుకున్నవారితోనే.. ఎంత అందంగా ఉన్నావని అనిపించుకుంది. జెన్ అట్కిన్ పోరాటం అందరికి ఆదర్శం. అధిక బరువుతో బాధపడే వారు కుంగిపోవాల్సిన అవసరం లేదు. శ్రమ, పట్టుదల ఉంటే.. బరువు తగ్గడం పెద్ద సమస్య కాదని జెన్ నిరూపించింది. యు ఆర్ రియల్లీ గ్రేట్.. అని నెటిజన్లు ఆమెని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

3

4