World Environment Day 2021: ప్రకృతి కోసం.. ఈ ఏడాది “RRR” థీమ్‌తో పర్యావరణ దినోత్సవం

గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి పంచభూతాలు.. ప్రకృతిలో మనం బాధ్యతగా ఉంటే ప్రకృతి మనల్ని బాగా చూసుకుంటుంది. మనిషికి మాత్రమే సొంతం అనుకుంటే.. మిగిలిన జీవరాసులకూ సమాన హక్కు ఉన్న ప్రకృతిని మనిషి మాత్రమే వాడుకుంటే మనిషి మనుగడకే ప్రమాదం అవుతుంది.

World Environment Day 2021: ప్రకృతి కోసం.. ఈ ఏడాది “RRR” థీమ్‌తో పర్యావరణ దినోత్సవం

World Environment Day 2021

World Environment Day 2021: గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి పంచభూతాలు.. ప్రకృతిలో మనం బాధ్యతగా ఉంటే ప్రకృతి మనల్ని బాగా చూసుకుంటుంది. మనిషికి మాత్రమే సొంతం అనుకుంటే.. మిగిలిన జీవరాసులకూ సమాన హక్కు ఉన్న ప్రకృతిని మనిషి మాత్రమే వాడుకుంటే మనిషి మనుగడకే ప్రమాదం అవుతుంది. ప్రకృతిని ప్రేమిస్తూ.. పర్యావరణాన్ని రక్షిస్తూ.. ముందుకు సాగితే, ప్రకృతి మన భవిష్యత్ తరాలకు సాయం చేస్తుంది. వాతావరణ సంక్షోభం మన జీవితాల్లో కొన్ని కోలుకోలేని మార్పులను చేస్తున్నందున, ప్రపంచ పర్యావరణ దినోత్సవం అటవీ నిర్మూలన, ప్లాస్టిక్ వ్యర్థాలు వంటి సమస్యలను పరిష్కరించడంలో ప్రత్యేకమైన పరిష్కారాలను ఈరోజు చర్చిస్తుంది ఐక్యరాజ్యసమితి.

ప్రపంచ పర్యావరణ దినోత్సవంను ప్రతీ ఏడాది జూన్ 5వ తేదిన జరుపుకుంటున్నారు. పర్యావరణానికి అనుకూలమైన చర్యలు తీసుకోవడానికి అవసరమైన ప్రపంచ అవగాహనను పెంచడానికి ఐక్యరాజ్యసమితి ఈమేరకు పర్యవరణ దినోత్సవం జరపాలని నిర్ణయించింది. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ (UNEP) ద్వారా ఈరోజును జరుపుతున్నారు. 1972 జూన్ 5వ తేదీ నుంచి 16వ తేది వరకు మానవ పర్యావరణంపై ఐక్యరాజ్యసమితి సమావేశం అయింది. ఈ సందర్భంగా 1972 లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ద్వారా ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏర్పాటు చేసింది. 1973లో మొదటిసారి ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకున్నారు.

2021 నేపథ్యం(Theme) ఏమిటంటే?
ప్రతి ఏడాది ఒక్కో థీమ్‌తో పర్యావరణ దినోత్సవం నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది RRR థీమ్‌తో పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. “Reimagine. Recreate. Restore” (పునరాలోచించు.. పున:సృష్టించు.. పునరుద్ధరించు..) ‘పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ'(Ecosystem Restoration) అనేది 2021 సంవత్సరానికి సంబంధించి ప్రపంచ పర్యావరణ దినోత్సవం కోసం ఐక్యరాజ్యసమితి థీమ్.

ఐక్యరాజ్యసమితి ప్రకారం.. మానవ జనాభా జీవనశైలిలో చిన్నమార్పులను తీసుకురావడానికి సంకల్పించాలి, ఇది సహజమైన వస్తువులను పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. సింగిల్-యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం (లేదా) నగరాల్లోని కాంక్రీట్ అరణ్యాలలో పచ్చదనం నింపడం వంటివి చేసేందుకు పరిశీలించి, సహాయపడే మార్గాలను పున:సృష్టించుకుని, పునరుద్ధరించుకోవాలన ఈ ఏడాది నేపథ్యం.

1974లో తొలిసారి ‘ఒకే ఒక్క భూమి’ థీమ్‌తో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. 2019 సంవత్సరంలో ‘బీట్ ఎయిర్ పొల్యూషన్’పేరుతో చైనాలో సదస్సు నిర్వహించారు. 2020లో ‘టైమ్ ఫర్ నేచర్.’ జర్మనీ సహకారంతో కొలంబియాలో నిర్వహించారు.