ప్రపంచవ్యాప్తంగా 4వేల కొవిడ్ రకాలున్నాయంటోన్న రీసెర్చర్లు

ప్రపంచవ్యాప్తంగా 4వేల కొవిడ్ రకాలున్నాయంటోన్న రీసెర్చర్లు

COVID VARIANTS: ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలకు గురై.. నెలల తరబడి వణుకు పుట్టించిన కొవిడ్ గురించి సైంటిస్టులకు అంతుపట్టలేదు. వ్యాక్సిన్ తయారుచేసేందుకు చేసిన పరిశోధనలతో సక్సెస్ అయ్యారు కానీ, వారు గమనించిన డేటాను బట్టి మొత్తం 4వేల కొవిడ్ రకాలు ఉన్నాయని గుర్తించారు. అటువంటి వాటన్నిటిపై సమర్థవంతంగా పనిచేయాలంటే ఏదో ఒక వ్యాక్సిన్ సరిపోదని.. కచ్చితంగా మిక్స్‌డ్ వ్యాక్సిన్ ఉండాల్సిందేనని చెప్తున్నారు.

ఫైజర్, ఆస్ట్రాజెనెకా షాట్స్‌ల మిక్సింగ్ డోస్ తీసుకుంటే బెటర్ ఫలితాలు వస్తాయని అంటున్నారు. వైరస్ మ్యూటేట్స్ అనేవి వేలల్లో ఉన్నట్లు గ్రహించారు. బ్రిటిష్, దక్షిణాఫ్రికా, బ్రెజిలియన్ కు చెందిన వేరియంట్లు వేగంగా వ్యాప్తి చెందాయి. ఈ మేరకు బ్రిటిష్ వ్యాక్సిన్ డిప్లాయ్‌మెంట్ మినిష్టర్ నధీమ్ జహవీ మాట్లాడుతూ.. ప్రస్తుత వ్యాక్సిన్లు కొత్త వేరియంట్లపై పనిచేయకపోవచ్చనే అనుమానవం వ్యక్తం చేశారు.

ఇతర సమస్యలు, హాస్పిటలైజేషన్ లకు కారణమవుతున్న కొవిడ్.. ఫైజర్, బయోటెక్, మోడర్నా, ఆక్స్‌ఫర్డ్త్త్త్-ఆస్ట్రాజెనెకాల ఫలితం ఎఫెక్టివ్ గా ఉండాలంటే.. మిక్స్ డ్ డోస్ తప్పనిసరిగా ఇవ్వాలి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకూ 4వేలకు పైగా వేరియంట్లు కనిపించాయి. అందులో చాలా వరకూ ఇతర వాటి కంటే మైనర్ మార్పులతో మాత్రమే కనిపించగా.. మిగిలిన వాటిలో భారీ తేడాలే ఉన్నాయి.

బ్రిటీష్ వేరియంట్ అయిన VUI-202012/01లో స్పైక్ ప్రొటీన్ వేరియంట్ కారణంగా.. హ్యూమన్ ACE2ను చాలా త్వరగా గమనించగలం. ఈ వేరియంట్లపై ఎఫెక్టివ్ గా ప్రభావం చూపించేందుకు ఫైజర్ వ్యాక్సిన్ తర్వాత బూస్టర్ గా ఆస్ట్రాజెనెకా వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. లేదంటే ఆస్ట్రాజెనెకా ఫస్ట్ డోస్ గా వాడితే బూస్టింగ్ డోస్ గా ఫైజర్ వాడాలి. ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది జూన్ వరకూ ప్రొడ్యూస్ అయిపోతుందని నిపుణులు అంటున్నారు.