Fathered 129 Children : ఏకంగా 129 మంది పిల్లలకు తండ్రి అయ్యాడు

యూకేకు చెందిన 66 ఏళ్ల క్లైవ్ జోన్స్ వీర్య దానం చేయడం ద్వారా 129 మంది పిల్లలకు తండ్రి అయ్యారు. మరో తొమ్మిది మంది పిల్లలకు త్వరలో తండ్రి కాబోతున్నారు.

Fathered 129 Children : ఏకంగా 129 మంది పిల్లలకు తండ్రి అయ్యాడు

Father

world most prolific sperm donor : సాధారణంగా ఐదారుగురు పిల్లలు… వెనుకటి కాలంలో అయితే పది మంది సంతానం ఉన్నవారు ఉండేవారు… కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా 129 మంది పిల్లలకు తండ్రి అయ్యారు. అయితే ఇది ఎలా సాధ్యమైందంటారా? వీర్యం దానం చేయడం ద్వారా సాధ్యమైంది. పాశ్చాత్య దేశాల్లో వీర్యదానం సంస్కృతి కొత్తేమీ కాదనే చెప్పాలి. అందుకు అక్కడి చట్టాలు కూడా అనుమతిస్తాయి.

బ్రిటన్ కు చెందిన 66 ఏళ్ల క్లైవ్ జోన్స్ వీర్య దానం చేయడం ద్వారా 129 మంది పిల్లలకు తండ్రి అయ్యారు. మరో తొమ్మిది మంది పిల్లలు త్వరలో పుట్టనున్నారు. తన 58 ఏట నుంచి వీర్యం దానం చేస్తున్నట్లు వెల్లడించారు. వీర్యం దానం చేసేందుకు డబ్బులు కూడా తీసుకోవడం లేదని పేర్కొన్నారు. ప్రపంచంలో తానే ఎక్కువమందికి వీర్యదానం చేసిన వ్యక్తినని చెప్పారు. మరికొన్నేళ్లపాటు వీర్యదానం చేస్తానని తెలిపారు. 150 మందికి తండ్రి అయిన తర్వాత వీర్య దానం
చేయనని స్పష్టం చేశాడు.

TATA Air India : నేటి నుంచి టాటా ఎయిరిండియా సర్వీసులు

కాగా, క్లైవ్ జోన్స్ అధికారికంగా వీర్యం దాత కాదు. బ్రిటన్ లో వీర్యం దాత గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు ఉండాలి. ఈ కారణంగా ఫేస్ బుక్ ద్వారా కస్టమర్లతో కనెక్ట్ అయి ఉచితంగా వీర్య దానం చేస్తున్నారు. బ్రిటన్ లో చాలా క్లినిక్ లు వీర్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. ఒకరికి ఆనందాన్ని ఇవ్వడం, వారికి ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేయడం ద్వారా తాను సంతోషపడుతున్నట్లు పేర్కొన్నారు.

10 సంవత్సరాల క్రితం న్యూస్ పేపర్ లో వచ్చిన ఒక కథనాన్ని చదివిన తర్వాత పిల్లలు లేని వ్యక్తులు ఎంత మానసిక వేదనకు అనుభవిస్తారో తెలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే యూకే హ్యూమన్ ఫర్టిలైజేషన్ అండ్ ఎంబ్రియాలజీ అథారిటీ క్లైవ్ జోన్స్ కు హెచ్చరికలు జారీ చేసింది. సాధారణంగా బ్రిటన్ లో వీర్యం దానం, అమ్మడం లైసెన్స్ పొందిన క్లినిక్ ద్వారా మాత్రమే చేయాలి. క్లైవ్ వాటిని పాటించకపోవడం వల్ల పలు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.