TATA Air India : నేటి నుంచి టాటా ఎయిరిండియా సర్వీసులు

ఎయిరిండియా తిరిగి టాటా స‌మూహంలోకే వ‌చ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని టాటా సన్స్‌ చైర్మన్‌ చంద్రశేఖరన్‌ అన్నారు. ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రయ‌త్నాలు చేస్తామన్నారు.

TATA Air India : నేటి నుంచి టాటా ఎయిరిండియా సర్వీసులు

Tata Air India

TATA Air India services : ఎయిరిండియాను అధికారికంగా టేకోవర్ చేసిన టాటా స‌న్స్ గ్రూప్‌… ఇవాళ్టి నుంచి ఆపరేషన్స్‌ మొదలుపెడుతోంది. టాటా గ్రూప్ నేతృత్వంలో ఎయిరిండియా సర్వీసులు నడవనున్నాయి. దీంతో ఎయిరిండియాలో జర్నీ సరికొత్తగా ఉండబోతోంది. ఓ ప్రత్యేక‌మైన ప్రక‌ట‌నతో ప్రయాణికులకు స్వాగ‌తం పలకబోతోంది. ఈ ప్రక‌ట‌న ద్వారా ఎయిరిండియా… టాటాలో క‌లిసిపోయింద‌న్న వార్తను ప్రయాణికుల‌కు తెల‌ప‌నుంది టాటా సంస్థ. ఈ మేరకు సిబ్బందికి దిశానిర్దేశం చేసింది. అంతేకాదు ఎంపిక చేసిన రూట్లలో భోజ‌న సౌక‌ర్యం కల్పిస్తోంది. ఇకపై టైం టు టైం సర్వీసులు నడపడంతో పాటు, మెరుగైన సేవలందించడంపైనే టాటా ఫోకస్ చేయబోతోంది.

ఎయిరిండియా తిరిగి టాటా స‌మూహంలోకే వ‌చ్చినందుకు తమకు ఎంతో సంతోషంగా ఉందని టాటా సన్స్‌ చైర్మన్‌ చంద్రశేఖరన్‌ అన్నారు . దీనిని తిరిగి ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలిపేందుకు శాయ‌శ‌క్తులా ప్రయ‌త్నాలు చేస్తామన్నారు. ఎయిరిండియా ఉద్యోగులంద‌రికీ మ‌నఃపూర్వకంగా స్వాగ‌తం ప‌లుకుతున్నామన్నారు. ఉద్యోగులంద‌రితో క‌లిసి న‌డ‌వ‌డానికి, క‌లిసి ప‌ని చేయ‌డానికి సిద్ధంగానే వున్నామని పేర్కొన్నారు.

Minister KTR Letter : కేంద్రానికి మంత్రి కేటీఆర్ మరో లేఖ.. జాతీయ పట్టణ ఉపాధిహామీ పథకం ప్రవేశపెట్టండి

మ‌న‌మంద‌ర‌మూ క‌లిసి దేశానికి ఏవిధంగా లాభం చేస్తామ‌ని యావ‌త్ ప్రజ‌లు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఎప్పుడైతే ఎయిరిండియా టాటాల చేతికే తిరిగి వ‌స్తుంద‌న్న వార్త బ‌య‌టికి వ‌చ్చిందో అంద‌రూ ఒక్కటే అన్నారాయన. ఎయిరిండియాను కొత్త శిఖ‌రాల వైపు తీసుకెళ్లాలని… అందుకు మ‌నం చాలా క‌ష్టప‌డాలి అంటూ టాటా స‌న్స్ చైర్మన్ చంద్రశేఖ‌ర‌న్ ఉద్యోగుల‌కు లేఖ రాశారు.

‘ప్రియమైన ప్రయాణికుడా నేను మీ కెప్టెన్‌ను మాట్లాడుతున్నాను.. ఈ చారిత్రక విమానంలోకి మీకు స్వాగ‌తం ప‌లుకుతున్నాం .. ఏడు ద‌శాబ్దాల త‌ర్వాత ఎయిరిండియా టాటా సంస్థలో విలీన‌మైంది.. ఈ విమానంతో పాటు ఎయిరిండియా విమానాలన్నింటిలోనూ అత్యంత నిబ‌ద్ధత‌తో, స‌రికొత్త అభిరుచుల‌తో సేవ‌లందించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు మీ యాత్రను ఆనందిస్తార‌ని మేము మ‌నఃస్ఫూర్తిగా ఆశిస్తున్నాం’ అన్న ప్రక‌ట‌తో ప్రయాణికుల‌కు స్వాగ‌తం చెప్పడానికి టాటా సంస్థ సిద్ధమైపోయింది.