XI-Jinping : టిబెట్‌‌ను సందర్శించిన జిన్ పింగ్

చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ టిబెట్ లో ప్రత్యక్షం కావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. హఠాత్తుగా ఆ దేశంలో పర్యటించడంతో పలు ఊహాగానాలు వ్యక్తమౌతున్నాయి. చైనా ఇప్పటికే భారీ వరదలతో ప్రజలు అల్లాడుతున్న సంగతి తెలిసిందే.

XI-Jinping : టిబెట్‌‌ను సందర్శించిన జిన్ పింగ్

China

Tibet : చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ టిబెట్ లో ప్రత్యక్షం కావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. హఠాత్తుగా ఆ దేశంలో పర్యటించడంతో పలు ఊహాగానాలు వ్యక్తమౌతున్నాయి. చైనా ఇప్పటికే భారీ వరదలతో ప్రజలు అల్లాడుతున్న సంగతి తెలిసిందే. వేయ్యేళ్ల తర్వాత..ఇలాంటి వరదలు వచ్చాయనే క్రమంలో..జిన్ పింగ్ టిబెట్ పర్యటనకు వెళ్లడం హాట్ టాపిక్ అయ్యింది. లాసాలోని బార్ ఖోర్ ప్రాంతంలో జిన్ పింగ్ ప్రసంగిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

Read More : Kaushal Manda : ‘పీపుల్ స్టార్’ ఏంటి.. ఇదెప్పుడు పెట్టారు?.. కౌశల్‌కు కౌంటర్స్..

పొటాలా ప్యాలస్ (టిబెటన్ల బౌద్ధ గురువు దలైలామా వింటర్ రెసిడెన్స్) వద్ద ఆయన మాట్లాడారు. టిబెట్ కి శాంతియుత విముక్తిని ప్రసాదించే కట్టడంగా ఆయన అభివర్ణించారు. వివిక్షకు గురయ్యే ఏ ఒక్క జాతిని ఆధునిక సోషలిస్టు చైనా ఆవిర్భావంలో విస్మరించే ప్రసక్తే లేదని, అన్ని జాతులను కలుపుకుని వెళుతామన్నారు. Nyingchi Mainling Airport లో దిగేంత వరకు ఆయన పర్యటనపై ఎలాంటి వివరాలు తెలియరాలేదు.

Read More : Landslide : మహారాష్ట్రలో విరిగిపడ్డ కొండచరియలు, 30మంది గల్లంతు

స్వాగతం పలికిన అనంతరం Nyang River Bridge దగ్గరకు వెళ్లారు. పర్యావరణ పరిరక్షణ గురించి తెలుసుకోవడానికి వెళ్లాడని CCTV వెల్లడించింది. రెండుసార్లు టిబెట్ ను జిన్ పింగ్ సందర్శించారు. జిన్ పింగ్ పర్యటనకు ముందు లాసాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పలు ఆంక్షలు, నిబంధనలు విధించారు. టిబెట్ పై తమదే ఆధిపత్యమని ఎప్పటి నుంచో చైనా వ్యాఖ్యానిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఐరాసాలో దీనిని ఖండించింది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ టిబెట్ పర్యటనపై భారత ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది.