IPL 2020, CSKvsKXIP: టాస్ గెలిచిన చెన్నై

IPL 2020, CSKvsKXIP: టాస్ గెలిచిన చెన్నై

IPL 2020: ఈ మ్యాచ్‌లో పంజాబ్‌పై చెన్నై విజయం సాధిస్తే.. రాహుల్ సేన ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. అలా జరిగితే టాప్-3లో ఉన్న బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లతోపాటు కోల్‌కతాకు ఊరట లభించినట్లే. తర్వాతి మ్యాచ్‌లో రాజస్థాన్‌పై కోల్‌కతా స్వల్ప తేడాతో గెలిస్తే.. ఢిల్లీ, బెంగళూరు జట్లు ప్లేఆఫ్‌కు దాదాపుగా అర్హత సాధించినట్లే. ఒకవేళ పంజాబ్ గెలిచినా.. రాజస్థాన్ భారీ విజయం సాధించినా.. ప్రస్తుతం టాప్-3 జట్లుగా ఉన్న ఆర్సీబీ, ఢిల్లీల్లో ఒక జట్టుకు మూడినట్లే.

ఇవాళ మ్యాచ్‌లో పంజాబ్‌ను ఓడిస్తే.. రెండో జట్టు ఎలిమినేట్ కావడానికి చెన్నై సహకరించినట్లు అవుతుంది. చెన్నై ఇప్పటి వరకూ ఆడిన ప్రతి సీజన్లో ప్లేఆఫ్స్‌కు చేరింది. ఈ సీజన్లో మాత్రమే టాప్-4లో నుంచి కూడా నిష్క్రమిస్తోంది. దీంతో చివరి మ్యాచ్‌ల్లో పరువు కాపాడుకునే ప్రయత్నంలో మాత్రమే ఆ జట్టు ఉంది.



IPL 2020: ఐపీఎల్‌ 2020 టోర్నీలో 53వ ఇవాళ మ్యాచ్ జరుగుతోంది. అబుదాబి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK), కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (KXIP) తలపడుతున్నాయి. సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. చెన్నై జట్టు మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది.

వాట్సన్ స్థానంలో ఫాప్ డుప్లెసిస్, సాంట్నర్ స్థానాంలో ఇమ్రాన్ తాహిర్, కర్ణ్ శర్మ స్థానంలో శార్దుల్ ఠాకూర్‌‌ను జట్టులోకి తీసుకున్నారు. అటు పంజాబ్ జట్టు రెండు మార్పులు చేసింది. అర్షదీప్ స్థానంలో మయాంక్ అగర్వాల్, మ్యాక్స్‌వెల్ స్థానంలో జిమ్మీ నీషమ్ జట్టులోకి వచ్చాడు.

Chennai Super Kings (Playing XI): Faf du Plessis, Ruturaj Gaikwad, Ambati Rayudu, MS Dhoni(w/c), N Jagadeesan, Ravindra Jadeja, Sam Curran, Shardul Thakur, Deepak Chahar, Lungi Ngidi, Imran Tahir

Kings XI Punjab (Playing XI): KL Rahul(w/c), Mayank Agarwal, Chris Gayle, Nicholas Pooran, Mandeep Singh, James Neesham, Deepak Hooda, Chris Jordan, Murugan Ashwin, Ravi Bishnoi, Mohammed Shami