లాక్‌డౌన్‍‌తో వాయిదా పడిన SSCపరీక్షల రీ-షెడ్యూల్

  • Published By: Subhan ,Published On : June 2, 2020 / 10:18 AM IST
లాక్‌డౌన్‍‌తో వాయిదా పడిన SSCపరీక్షల రీ-షెడ్యూల్

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన SSC పరీక్షల కొత్త తేదీలను ప్రకటించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC). అంతేకాకుండా మరికొన్ని కొత్త నోటిఫికేషన్ కూడా విడుదల చేయనుంది. గతేడాది విడుదల చేసిన కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (CHSL),జూనియర్ ఇంజనీర్ ఎగ్జామినేషన్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ C&D, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్, ఈ ఏడాది విడుదల చేసిన సబ్ ఇన్‌స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్, జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్, జూనియర్ సీనియర్ ట్రాన్స్ లేటర్ పరీక్షలకు సంబంధించిన తేదీలను ప్రకటించింది. 

ఈ 7 నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలను ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు నిర్వహించనున్నట్లు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)తెలిపింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)పరీక్షల రీ షెడ్యూల్ వివరాలిలా ఉన్నాయి. 
 

> కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్(CHSL Tier-1)ఎగ్జామినేషన్ 2019 – ఆగస్టు 17, 2020 నుంచి ఆగస్టు 21, 2020 వరకు, ఆగస్ట్ 24, 2020 నుంచి ఆగస్టు 27, 2020. 

>జూనియర్ ఇంజనీర్ (పేపర్ -1) ఎగ్జామినేషన్ 2019 – సెప్టెంబర్ 1,2020  నుంచి సెప్టెంబర్ 4, 2020.

>సెలెక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ 2020 ఫేజ్ VIII- సెప్టెంబర్ 7,2020  నుంచి సెప్టెంబర్ 9,2020.

>స్టెనోగ్రాఫర్ గ్రేడ్ C&D ఎగ్జామినేషన్ 2019- సెప్టెంబర్ 10,2020 నుంచి సెప్టెంబర్12, 2020.

> సబ్ ఇన్‌స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సీఆర్ పీఎఫ్, సీఏపీఎఫ్ ఎగ్జామినేషన్ (పేపర్ 1) 2020- సెప్టెంబర్ 29, 2020 నుంచి అక్టోబర్ 1,2020, అక్టోబర్ 5, 2020.

> జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, హిందీ ప్రాధ్యాపక్ ఎగ్జామినేషన్ (పేపర్ 1)- 2020- అక్టోబర్ 6,2020.

> కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2019 (టైర్ 2)- అక్టోబర్ 14,2020 నుంచి అక్టోబర్ 17,2020.

అభ్యర్దులు పరీక్ష సమయాలు, తేదీలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఎస్ఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో చూడాలని తెలిపింది.

Read: 8వ తరగతి పాసైతే చాలు : BECILలో మల్టీ టాస్కింగ్ ఉద్యోగాలు