Pune : వైరల్ అవుతున్న 1954 టెన్త్ క్లాస్ రీయూనియన్ పార్టీ.. తమ స్కూల్ డేస్ గుర్తు చేసుకున్న నెటిజన్లు

స్కూల్ డేస్‌ని, స్కూలు జ్ఞాపకాల్ని ఎవరూ మర్చిపోలేరు. ఇక రీయూనియన్ జరిగినపుడు ఆ సంతోషాన్ని మర్చిపోలేరు. 1954 లో పూనేలో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్ధులు ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. వారి ఆనందం మాటల్లో కంటే చూస్తేనే అర్ధమవుతుంది.

Pune : వైరల్ అవుతున్న 1954 టెన్త్ క్లాస్ రీయూనియన్ పార్టీ.. తమ స్కూల్ డేస్ గుర్తు చేసుకున్న నెటిజన్లు

Pune

Updated On : June 13, 2023 / 5:18 PM IST

Viral Video : 1954 లో వారంతా 10వ తరగతి చదువుకున్నారు. అంటే దాదాపుగా 69 సంవత్సరాలు అవుతోంది. పూర్వ విద్యార్ధుల సమ్మేళనంలో మళ్లీ ఒక్కటయ్యారు. ఇక వారి సంతోషం ఎలా ఉంటుంది?.. పూనేలో జరిగిన ఓ రీయూనియన్ పార్టీ అందరి మనసుల్ని దోచుకుంది.

RJ Hattie Pearson : వృద్ధుడి మాటలకు కన్నీరు పెట్టుకున్న రేడియో జాకీ

ఎంత పెద్ద చదువులు చదువుకున్నా.. ఎక్కడ స్థిరపడ్డా .. ఎంతమంది స్నేహితులు కలిసినా స్కూలుతో.. అక్కడి స్నేహితులతో, ఉపాధ్యాయులతో ఉన్న అనుబంధాన్ని ఎవరూ మర్చిపోరు. స్కూల్ జ్ఞాపకాలకి అందరి మనసుల్లో ప్రత్యేకమైన స్ధానం ఉంటుంది. సోషల్ మీడియా పుణ్యమా అని ఎప్పుడెప్పుడో చదువుకున్న వారంతా తమ తోటి స్నేహితులను వెతికి పట్టుకోవడం వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి రీయూనియన్లు నిర్వహించుకోవడం ఇప్పుడు ఎక్కువైంది. 1954 అంటే దాదాపుగా 69 సంవత్సరాలు అవుతోంది..పూణేలో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్ధులు అత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

 

గబ్బర్ సింగ్ (@GabbbarSingh) అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన ఈ వీడియో చూస్తే అందరూ బాగా పెద్దవారయ్యారు. కానీ తమ స్నేహితుల్ని కలుసుకున్న ఆనందంలో చిన్నపిల్లలు అయిపోయారు. ఎంతో సంతోషంగా కనిపించారు. అంతేకాదు ‘అనారి’ సినిమాలోని ‘కిసీకి ముస్కురహతోన్ పే’ అనే మెలోడీకి ఆనందంతో డ్యాన్స్ చేశారు. ఎన్నో సంవత్సరాల తరువాత కలిసిన ఆనందం వారి కళ్లలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. వారిలో ఒక వృద్ధ మహిళ టోపీ పెట్టుకుని పాటకి అనుగుణంగా స్పెప్పులు వేశారు. మరో పెద్దాయన ఆమెతో కలిసి సంతోషంగా డ్యాన్స్ చేశారు.

Alice D’Souza : ఆస్తి వివాదంలో 80 ఏళ్లుగా న్యాయ పోరాటం.. విజయం సాధించిన 93ఏళ్ల వృద్ధురాలు

ఈ వీడియో చూస్తే వారు ఈ ప్రపంచాన్ని మర్చిపోయి ఒక్కసారిగా స్కూల్ డేస్‌లోకి వెళ్లిపోయారా? అనే ఆశ్చర్యం కలుగుతుంది. వీడియో చూసిన నెటిజన్లు మనసుని హత్తుకుందంటూ రిప్లైలు ఇచ్చారు. చిన్ననాటి స్నేహం ఎంత గొప్పదో.. ఎంతటి బలాన్ని ఇస్తుందో.. ఈ వీడియో చూసిన వారికి అర్ధమవుతుంది. ప్రతి ఒక్కరికి  వారి స్కూల్ డేస్‌ని గుర్తుకు చేస్తుంది.