Rajasthan Govt: బూస్టర్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న 11 సార్లు కరోనా సోకిన వ్యక్తి!

ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో కరోనా మళ్ళీ విజృంభిస్తుంది. చూస్తుండగానే కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో ఆయా రాష్ట్రాలు కట్టడి చర్యలతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతంగా..

Rajasthan Govt: బూస్టర్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న 11 సార్లు కరోనా సోకిన వ్యక్తి!

Rajasthan Govt

Rajasthan Govt: ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో కరోనా మళ్ళీ విజృంభిస్తుంది. చూస్తుండగానే కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో ఆయా రాష్ట్రాలు కట్టడి చర్యలతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతంగా చేపడుతున్నాయి. దేశంలోని కొన్ని రాష్ట్రాలలో రెండు డోసులు తీసుకున్నా మరింత ఎఫెక్టివ్ రక్షణ కోసం బూస్టర్ డోస్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. ఒమిక్రాన్​ విజృంభిస్తున్న నేపథ్యంలో రాజస్థాన్​ ప్రభుత్వం ఫ్రంట్​ లైన్ వర్కర్లకు, 60 ఏళ్లు పూర్తి చేసుకున్న వారికి బూస్టర్ డోసును పంపిణీ చేయడాన్ని ప్రారంభించింది.

Kishan Reddy : బూస్టర్ డోసు తప్పక తీసుకోండి.. పుకార్లను నమ్మొద్దు : కిషన్ రెడ్డి

ఈ క్రమంలో పదకొండు సార్లు కరోనా బారిన పడిన మహేశ్​ ఉత్తమ్​ చందానీ అనే వ్యక్తి బూస్టర్ డోసు తీసుకున్నారు. జోధ్​పుర్​లోని ఓ టీకా పంపిణీ కేంద్రంలో మూడో డోసు తీసుకున్నట్లు చందానీ తెలిపారు. మహేశ్​ ఉత్తమ్​ చందానీ, అతని కుటుంబం గతంలో టర్కీలో జరిగిన ఓ వివాహానికి హాజరై భారత్​కు తిరిగి వస్తుండగా కొవిడ్​ బారిన పడ్డారు. ఆ తరువాత అతని కుటుంబ సభ్యులకు కూడా వైరస్​ సోకింది. 2020లో జోధ్​పుర్​లో వెలుగు చూసిన తొలి కరోనా కేసు మహేశ్​దే కావడం గమనార్హం.

Delhi Police Corona : కరోనా టెర్రర్.. ఒకేసారి వెయ్యి మంది పోలీసులకు కోవిడ్

ఇప్పటి వరకు 11 సార్లు వైరస్​ బారిన పడిన చందానీ.. 40 రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్నారు. బూస్టర్​ డోస్​ వేస్తున్నారని తెలియగానే దగ్గరలోని వ్యాక్సినేషన్ సెంటర్ కి వెళ్లి మూడో డోసు తీసుకున్నారు. అర్హులు అందరూ బూస్టర్​ డోసు తీసుకోవాలని కోరిన మహేష్ చందానీ.. 60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ మూడో​ డోసు తీసుకోవాలని కోరారు.