Boney Kapoor : బోనికపూర్ క్రెడిట్ కార్డు నుంచి 3.82 ల‌క్ష‌లు చోరీ.. పోయినట్టు కూడా తెలీదు..

తాజాగా బాలీవుడ్ అగ్ర నిర్మాత, శ్రీదేవి భర్త బోని కపూర్ క్రెడిట్ కార్డు నుంచి లక్షలు దోచేశారు సైబర్ కేటుగాళ్లు. బోనీ క‌పూర్ క్రెడిట్ కార్డు నుంచి 3.82 ల‌క్ష‌లు చోరీ.........

Boney Kapoor : బోనికపూర్ క్రెడిట్ కార్డు నుంచి 3.82 ల‌క్ష‌లు చోరీ.. పోయినట్టు కూడా తెలీదు..
ad

Boney Kapoor :   ఇటీవల సైబర్ నేరగాళ్లు ఎక్కువైపోయారు. సామాన్య ప్రజలు, సెలబ్రిటీలు అని తేడా లేకుండా ఎవరు దొరికితే వాళ్ళని దోచేసుకుంటున్నారు. ఈ మధ్య మరింత టెక్నాలజీ వాడి అసలు మన అకౌంట్స్ లో డబ్బులు పోయినట్టు కూడా తెలీకుండా లాగేస్తున్నారు.

తాజాగా బాలీవుడ్ అగ్ర నిర్మాత, శ్రీదేవి భర్త బోని కపూర్ క్రెడిట్ కార్డు నుంచి లక్షలు దోచేశారు సైబర్ కేటుగాళ్లు. బోనికపూర్ బాలీవుడ్, సౌత్ లో వరుస సినిమాలకు ప్రొడ్యూస్ చేస్తూ బిజీగా ఉన్నారు. బోని కపూర్ కూతురు జాన్వీ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇలాంటి సమయంలో బోనీ క‌పూర్ క్రెడిట్ కార్డు నుంచి 3.82 ల‌క్ష‌లు చోరీ జ‌రిగింది. అయితే ఈ డబ్బులు పోయినట్టు కూడా తనకి తెలియలేదు. తాజాగా అతని అకౌంట్స్ చూసుకున్నప్పుడు తేడా రావడంతో చెక్ చేయగా ఈ మోసం బయట పడింది. దీంతో ముంబైలోని అంబోలీ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు బోనికపూర్.

Mythri Movie Makers : టాలీవుడ్‌ని రూల్ చేస్తున్న ప్రొడక్షన్ హౌస్.. వామ్మో ఇన్ని సినిమాలా..

 

ఫిబ్ర‌వ‌రి 9వ తేదీన త‌న అకౌంట్ నుంచి 3.82 ల‌క్ష‌లు ట్రాన్స్‌ఫ‌ర్ అయిన‌ట్లు బోనీక‌పూర్ త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. అయిదు సార్లుగా ఆ లావాదేవీలు జ‌రిగిన‌ట్లు తెలిపారు. త‌న‌ను ఎవ‌రూ క్రెడిట్ కార్డు వివ‌రాలు అడ‌గ‌లేద‌ని, క‌నీసం ఫోన్ కాల్ కూడా రాలేద‌ని బోనికపూర్ తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణలో బోనీ క‌పూర్ క్రెడిట్ కార్డు వాడుతున్న స‌మ‌యంలో సైబ‌ర్ నేర‌గాళ్లు డేటాను చోరీ చేసి ఉంటార‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే చోరీ జరిగిన డబ్బు గురుగ్రామ్‌లోని ఓ కంపెనీ అకౌంట్‌లోకి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు ఆ దిశగా ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు.