‘Namokar Mantra’: విద్యుత్ బల్బుపై ‘నమోకర్ మంత్రం’ చెక్కిన 70 ఏళ్ల వృద్ధుడు

70 ఏళ్ల వృద్ధుడు విద్యుత్ బల్బులపై నమోకర్ మంత్రాన్ని చెక్కి అందరిని ఆశ్చర్యపరిచారు. అత్యంత సున్నితంగా ఉండే గాజు బల్బులపై మంత్రాన్ని చెక్కటం అంటే..

‘Namokar Mantra’: విద్యుత్ బల్బుపై ‘నమోకర్ మంత్రం’ చెక్కిన 70 ఏళ్ల వృద్ధుడు

'namokar Mantra' On Electric Bulbs

‘Namokar Mantra’ on electric bulbs : 40 ఏళ్లకే నిరాశ..50 ఏళ్లు దాటితే చాలు ఇంకే చేస్తాం అంటూ రిలాక్స్ అయిపోతారు చాలామంది. 55 ఏళ్లు వస్తే ఇంకేముందు రిటైర్ మెంట్ ఏజ్ వచ్చేసింది..జీవితంలో ఇప్పటికే చాలా కష్టపడ్డాం. ఇక హాయిగా రెస్ట్ తీసుకుంటూ సాధ్యమైనంత ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు చాలామంది.కానీ ఓ 70 ఏళ్ల వృద్ధుడు మాత్రం అత్యంత సున్నితంగా ఉండే విద్యుత్ బల్బులపై సుత్తితో మంత్రాన్ని చెక్కి నేషనల్ స్థాయిలో ప్రశంసలు పొందుతున్నారు. అతే మధ్యప్రదేశ్ కు చెందిన విమల్‌చంద్ర జైన్.

గ్వాలియర్‌కు చెందిన విమల్‌చంద్ర జైన్ విద్యుత్ బల్బుపై ‘నమోకర్ మంత్రాన్ని’ చెక్కుతున్నారు. అదికూడా శిల్పాలు చెక్కే ఉలి,సుత్తితో. విద్యుత్ బల్బు చాలా సున్నితంగా ఉంటుంది.గట్టిగా పట్టుకుంటేనే పగిలిపోయేలా ఉంటుంది.అటువంటి బల్బుపై సుత్తి ఉలితో ఓ అక్షరం చెక్కటమే పెద్ద గొప్ప. అటువంటిది ఏకంగా ఓ మంత్రాన్నే చెక్కి శెభాష్ అనిపించుకుంటున్నారు విమల్ చంద్ర. ఇటువంటి సున్నితమైన పనులు చేయాలంటే ఎంతో ఓర్పు, నేర్పు ఉండాలి.

గాజుపై ఓ చిత్రాన్ని గీయాలంటేనే ఎంతో నేర్పు అవసరం. అటువంటిది అత్యంత పల్చగా ట్రాన్పరెంట్ గా ఉండే విద్యుత్ బల్బుపై అక్షరాలను చెక్కాలంటే ఇంకెంత నేర్పు కావాలో ఊహించుకోవచ్చు. కానీ విమల్ చంద్ర ఏకంగా విద్యుత్ బల్బుపై నమోకర్ మంత్రాన్ని చెక్కారు.

దీని గురించి విమల్ చంద్ర మాట్లాడుతు..విద్యుత్ బల్బుమీద ‘నమోకర్ మంత్రాన్ని’ చెక్కటానికి నాకు 2 నుంచి 3 గంటలు పడుతుంది అని తెలిపారు. మాకు ఓ షాపు ఉంది. మా షాపులో కుండలపై పేర్లు చెక్కుతుంటాం. అలా బల్బుపై కూడా చెక్కితే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. అలా ప్రయత్నించి ప్రయత్నించి ఇలా చేస్తున్నానని తెలిపారు. మొదట్లో బల్బులపై అక్షరాలు చెక్కుతున్నప్పుడు అవి పగిలిపోయేవి.దీంతో ఇంకా సున్నితంగా ఓర్పుగా చేయాల్సి వచ్చింది. అలా..అలా ‘నమోకర్ మంత్రం’ చెక్కాలని అనిపించి ఇలా చేశాను అని తెలిపారు.