Trivikram: సినిమా విడుదల అంటే అమ్మాయిని అత్తారింటికి పంపినట్లే -త్రివిక్రమ్

ప్రపంచవ్యాప్తంగా థియేటర్లకు జనాలే రాని పరిస్థితి కనిపిస్తుంటే, తెలుగు థియేటర్లలో మాత్రం భారీ సంఖ్యలో సినిమాలు చూడటానికి సాహసం చేస్తున్నారని దర్శకుడు త్రివిక్రమ్ అన్నారు

Trivikram: సినిమా విడుదల అంటే అమ్మాయిని అత్తారింటికి పంపినట్లే -త్రివిక్రమ్

Trivikram

Updated On : August 25, 2021 / 8:26 AM IST

Trivikram: ప్రపంచవ్యాప్తంగా థియేటర్లకు జనాలే రాని పరిస్థితి కనిపిస్తుంటే, తెలుగు థియేటర్లలో మాత్రం భారీ సంఖ్యలో సినిమాలు చూడటానికి తెలుగు ప్రేక్షకులు సాహసం చేస్తున్నారని దర్శకుడు త్రివిక్రమ్ అభిప్రాయపడ్డారు. సినిమా విడుదల అనేది అత్తారింటికి ఓ అమ్మాయిని పంపడమే అన్నారు త్రివిక్రమ్. మహమ్మారి సంక్షోభం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మంచి కంటెంట్‌ని సృష్టిస్తే హిట్ కొట్టడం కష్టం కాదని అన్నారు.

హైదరాబాద్‌లో జరిగిన ‘ఇచ్చట వాహనాలు నిలుపరాడు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన త్రివిక్రమ్.. సుశాంత్ ఒక చట్రంలో ఇరుక్కుపోయాడని అనుకునేవాడినని, అయితే ‘చిలసౌ’ సినిమాతో తన పంథాను మార్చుకున్నాడని అన్నారు.

ఆ సినిమాను చూసి అల వైకుంఠపురములో సినిమాలో చేయించాలని అనుకున్నాను అని చెప్పారు. అల వైకుంఠపురములో సినిమా చేస్తున్నప్పుడు ఈ సినిమా గురించి సుశాంత్ నాకు చెప్పారు. ఈ సినిమా సుశాంత్‌కు హ్యాట్రిక్ అవుతుందనే నమ్మకం ఉంది.

ఇచ్చట వాహనములు నడుపరాదు సినిమా బాగా వచ్చిందని విన్నాను.. యాక్టర్స్‌కి ఏడవడం కష్టం అనుకుంటారు కానీ నవ్వడం ఎంతో కష్టం. ఈ సినిమాలో ఒన్ డే లో ఒక సాంగ్ తీశారని తెలిసింది. అది చాలా సంతోషించే విషయం. ప్రవీణ్ మ్యూజిక్ నాకు బాగా నచ్చింది. పాటలు బాగున్నాయి.