మోజు తీరాక వయసు గుర్తొచ్చింది, నటి ఫిర్యాదుతో హీరో అరెస్ట్

తమిళ సినీ హీరో త్యాగరాజన్(32) ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో తనను నమ్మించి లైంగిక వాంఛలు తీర్చుకుని

  • Published By: naveen ,Published On : June 13, 2020 / 12:23 PM IST
మోజు తీరాక వయసు గుర్తొచ్చింది, నటి ఫిర్యాదుతో హీరో అరెస్ట్

తమిళ సినీ హీరో త్యాగరాజన్(32) ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో తనను నమ్మించి లైంగిక వాంఛలు తీర్చుకుని

తమిళ సినీ హీరో త్యాగరాజన్(32) ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో తనను నమ్మించి లైంగిక వాంఛలు తీర్చుకుని మొహం చాటేశాడని సహాయ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. చెన్నై రాజా అన్నామలైపురానికి చెందిన త్యాగరాజన్‌ (32) ‘తరిసూలం’ అనే తమిళ సినిమాలో హీరోగా నటించాడు. ‘నాడోడిగళ్‌’ సినిమాలో సహాయ నటి పాత్ర పోషించిన మహిళతో అతడికి కొంతకాలం క్రితం పరిచయం ఏర్పడింది. ఆమె వయసులో అతడి కంటే పెద్దది. ప్రేమ పేరుతో తనను వెంట తిప్పుకున్న త్యాగరాజన్.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి కొద్దిరోజులు సహజీవనం చేశాడని, లైంగిక వాంఛలు తీర్చుకోవడంతో పాటు భారీ మొత్తంలో నగదు తీసుకున్నాడని బాధితురాలు ఆరోపించింది. 

మోజు తీర్చుకున్నాక:
రీసెంట్ గా త్యాగరాజన్‌కి చెన్నై కార్పొరేషన్‌లో ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి తనతో మాట్లాడటం మానేశాడని బాధితురాలు వాపోయింది. గట్టిగా నిలదీయగా.. ‘నువ్వు నాకంటే వయసులో ఏడాది పెద్దదానివి. అందువల్ల మా పేరెంట్స్ పెళ్లికి ఒప్పుకోరు. నువ్వే వేరొకరిని పెళ్లి చేసుకో’ అని సలహా ఇచ్చాడని ఆవేదన వ్యక్తం చేసింది. మరోసారి వెంట పడితే చంపేస్తానని తనను బెదిరించాడంది. దీంతో చెన్నైలోని మాంబలం మహిళా పోలీస్‌ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. త్యాగరాజన్‌పై కేసు నమోదు చేసి పోలీసులు గురువారం అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం రిమాండ్ విధించడంతో పుళల్ జైలుకు తరలించారు.