హీరోయిన్ ఆనంది సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంది..

హీరోయిన్ ఆనంది సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంది..

Actress Anandhi Marriage: లాక్‌డౌన్ సమయంలో సినిమా పరిశ్రమలో పెళ్లి బాజాలు బాగానే మోగుతున్నాయి. ఇప్పటికే రానా, నితిన్, నిహారిక కొణిదెల వంటివారు ఓ ఇంటివారయ్యారు. తాజాగా యంగ్ యాక్ట్రెస్, తెలుగమ్మాయి ఆనంది కూడా వివాహం చేసుకుంది. అదికూడా సీక్రెట్‌గా.. రహస్య వివాహం అనగానే ప్రేమపెళ్లి అనుకునేరు..
కాదు.. పెద్దలు కుదిర్చిన పెళ్లే చేసుకుంది.

సొంతఊరు వరంగల్‌లోని ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో అతికొద్దిమంది బంధువులు, స్నేహితుల సమక్షంలో సోక్రటీస్, ఆనందిల వివాహం జరిగింది. సోక్రటీస్‌ తమిళనాట దర్శకత్వ శాఖలో పనిచేస్తున్నాడని సమాచారం. ఇదిలాఉంటే కెరీర్ మంచి పొజిషన్‌లో ఉండగానే ఆనంది ఇంత సైలెంట్‌గా ఎందుకు పెళ్లి చేసుకుందబ్బా అంటూ సినీ అభిమానులు, టాలీవుడ్ వర్గాలవారు చర్చించుకుంటున్నారు.

‘ఈరోజుల్లో’, ‘బస్ట్ స్టాప్’, ‘నాయక్’, ‘ప్రియతమా నీవచటకుశలమా’, ‘గ్రీన్ సిగ్నల్’ వంటి సినిమాల్లో నటించిన ఆనంది ఆతర్వాత తమిళ్‌లో బిజీ అయ్యింది. ఆమె నటించిన లేటెస్ట్ తెలుగు మూవీ ‘జాంబి రెడ్డి’ రిలీజ్‌కి రెడీగా ఉంది.

Anandhi Marriage